చికిత్సలు
ఏ సమస్యకి ఏ డాక్టర్, వస్తే ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం చేయాలి – విభాగాల వారీగా. ల్యాబ్, X-ray, ICU, వెంటిలేటర్ ఇక్కడే, కైకలూరులోనే.
అత్యవసరం అయితే వేచి ఉండకండి – ఏ సమయంలోనైనా 9346113364
జనరల్ మెడిసిన్· డా. పర్వీన్ సుల్తానా
షుగర్ (డయాబెటిస్)
Diabetes
రక్తంలో చక్కెర ఎక్కువై, కళ్లు, కిడ్నీలు, నరాలు, గుండె – అన్నిటినీ మెల్లగా దెబ్బతీస్తుంది. నొప్పి లేకుండానే జరుగుతుంది, అందుకే పరీక్ష చేయించుకోవడం ఒక్కటే దారి.
బి.పి. (రక్తపోటు)
High blood pressure
రక్తనాళాల్లో ఒత్తిడి ఎక్కువై గుండె, మెదడు, కిడ్నీల మీద పడుతుంది. చాలామందికి ఏ లక్షణమూ ఉండదు – పక్షవాతం వచ్చాకే తెలుస్తుంది.
థైరాయిడ్
Thyroid problems
మెడలోని చిన్న గ్రంథి పనితీరు తగ్గినా, పెరిగినా శరీరమంతా ప్రభావం – బరువు, నిద్ర, నెలసరి, గుండె వేగం అన్నీ మారతాయి. రక్త పరీక్షతో తేలిపోతుంది.
జ్వరం, జలుబు & దగ్గు
Fever, cold and cough
మూడు రోజులు దాటిన జ్వరం మామూలు జలుబు కాదు – డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, మూత్ర ఇన్ఫెక్షన్, న్యుమోనియా ఏదైనా కావొచ్చు. పరీక్ష చేస్తేనే తెలుస్తుంది.
గ్యాస్, కడుపు ఉబ్బరం & జీర్ణ సమస్యలు
Acidity and digestion problems
కడుపులో మంట, ఉబ్బరం, మలబద్ధకం – చాలావరకు తిండి, సమయం, ఒత్తిడి వల్లే. కానీ ఛాతీ మంటలా అనిపించేది గుండె నొప్పి కూడా కావొచ్చు, అందుకే ఒకసారి చూపించుకోవడం మంచిది.
ఆస్తమా, ఆయాసం & ఊపిరితిత్తుల సమస్యలు
Asthma and breathing problems
శ్వాస నాళాలు ఇరుకై గాలి ఆడకపోవడం. దుమ్ము, చలి, పొగ, జలుబు – వీటితో ఎక్కువవుతుంది. సరైన మందుతో మామూలు జీవితం గడపొచ్చు.
లివర్ సమస్యలు & కామెర్లు
Liver problems and jaundice
కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం. వైరస్, మద్యం, మందులు, పిత్తాశయ రాళ్లు – కారణం ఏదో పరీక్షతోనే తెలుస్తుంది. నాటు మందులతో కామెర్లు తగ్గవు, ఇంకా పాడవుతుంది.
కిడ్నీ & మూత్ర సమస్యలు
Kidney and urine problems
మూత్ర ఇన్ఫెక్షన్, రాళ్లు, కిడ్నీ పనితీరు తగ్గడం – అన్నీ మొదట్లో చిన్నగానే కనిపిస్తాయి. షుగర్, బీపీ ఉన్నవారికి కిడ్నీ పరీక్ష ఏడాదికోసారి తప్పనిసరి.
ఫిట్స్ (మూర్చ)
Fits and epilepsy
మెదడులో విద్యుత్ కదలిక ఒక్కసారిగా తేడా రావడం. మందులతో చాలామందికి పూర్తిగా ఆగిపోతాయి – మందు ఆపడం వల్లే మళ్ళీ వస్తాయి.
పార్కిన్సన్ (వణుకు వ్యాధి)
Parkinsons disease
మెదడులోని ఒక భాగం నెమ్మదిగా బలహీనపడి, కదలికలు నిదానించడం, వణుకు, బిగువు వస్తాయి. మందులతో చాలా వరకు మామూలుగా ఉండగలరు.
పాము కాటు
Snake bite
పొలం పని, రాత్రి నడక – ఇక్కడ ఇది అరుదు కాదు. విషం ఉందా లేదా అనేది చూసి చెప్పలేరు, గంటల తర్వాతే బయటపడొచ్చు. అందుకే ప్రతి కాటుకీ ఆసుపత్రికి రావాలి.
కుక్క కాటు
Dog bite
రేబిస్ వచ్చాక చికిత్స లేదు – కానీ కాటు తర్వాత సరైన సమయంలో ఇంజెక్షన్లు వేయించుకుంటే పూర్తిగా ఆపొచ్చు. ఇంట్లో కుక్క అయినా, చిన్న గీత అయినా అదే నియమం.
చెవి, ముక్కు, గొంతు (ENT)· డా. హారిక
ఈ విభాగం ఆపరేషన్లు →చెవి నొప్పి & కారుడు
Ear pain and discharge
చెవిలో ఇన్ఫెక్షన్, గులిమి, పొరకు చిల్లు – కారణం చూడకుండా చుక్కలు వేయడం వల్ల చాలామందికి పొర దెబ్బతింటుంది. ఎండోస్కోప్‌తో లోపల చూస్తేనే తెలుస్తుంది.
వినికిడి లోపం
Hearing loss
గులిమి లాంటి చిన్న కారణం నుంచి, చెవి పొర, నరం వరకు – ఏ దశలో సమస్య ఉందో పరీక్షతో తెలుస్తుంది. పిల్లల్లో ఆలస్యం చేస్తే మాట కూడా ఆలస్యమవుతుంది.
సైనస్ & ముక్కు ఎలర్జీ
Sinus and nasal allergy
దుమ్ము, చలి, పొగకు ముక్కు లోపలి పొర స్పందించి వాచిపోవడం. ఇదే ఎక్కువకాలం ఉంటే సైనస్‌లు మూసుకుపోయి తలనొప్పి, వాసన పోవడం వస్తాయి.
ముక్కు నుంచి రక్తం
Nose bleed
ముక్కు లోపలి పొరలో సన్నని నాళాలు పగలడం – ఎండ, పొడి గాలి, ముక్కు గీకడం, బీపీ, రక్తం పలచబడే మందులు. చాలావరకు ప్రమాదం కాదు, కానీ ఆగకపోతే చూపించాలి.
గొంతు నొప్పి & మింగడం ఇబ్బంది
Sore throat and swallowing problems
టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, గొంతు వాపు, ఇరుక్కున్న ముల్లు – కారణం వేరైనా బాధ ఒకటే. రెండు వారాలు దాటిన బొంగురు గొంతు మాత్రం తప్పకుండా చూపించాలి.
గుండె వ్యాధులు (కార్డియాలజీ)· డా. దశరథ్ బొప్పన
గుండెపోటు & గుండె సమస్యలు
Heart attack and heart problems
గుండెకు రక్తం ఆగిపోవడం. ప్రతి నిమిషం ముఖ్యం – మొదటి గంటలో చికిత్స మొదలైతే ప్రాణం, గుండె రెండూ కాపాడొచ్చు. చాలామంది గ్యాస్ అనుకుని ఆలస్యం చేస్తారు.
గుండె వైఫల్యం & గుండె దడ
Heart failure and palpitations
గుండె సరిపడా రక్తాన్ని పంపలేకపోవడం – ఆయాసం, కాళ్ల వాపు, రాత్రి పడుకోలేకపోవడం. మందులతో చాలా వరకు మామూలుగా ఉండొచ్చు, కానీ మందు ఆపడం వల్లే చాలామంది మళ్ళీ చేరతారు.
గుండె కవాటాలు & గుండె రంధ్రం
Heart valve problems and hole in the heart
గుండె కవాటాలు సరిగ్గా మూయకపోవడం, లేదా గోడలో రంధ్రం. 2D ఎకోతో ఇక్కడే కచ్చితంగా తెలుస్తుంది. ఆపరేషన్ అవసరమైతే మాత్రం అది ఇక్కడ చేయరు – పెద్ద సెంటర్‌కి పంపుతారు.
చర్మ వ్యాధులు (డెర్మటాలజీ)· డా. మేఘన వలేటి
ఈ విభాగం ఆపరేషన్లు →దురద, తామర & ఎగ్జిమా
Itching and eczema
ఎలర్జీ, పొడి చర్మం, సబ్బులు, ఫంగస్ – దురదకు కారణాలు వేరువేరు, చికిత్స కూడా వేరు. ఒకరికి పనిచేసిన క్రీము ఇంకొకరికి పెంచుతుంది.
మొటిమలు & ముఖం మచ్చలు
Acne and facial marks
చర్మంలో నూనె గ్రంథులు ఎక్కువ పనిచేయడం. చిదిమితే మచ్చ, గుంత శాశ్వతంగా ఉండిపోతాయి – అందుకే మొదట్లోనే చికిత్స మొదలుపెడితే మచ్చలే ఉండవు.
సోరియాసిస్ & బొల్లి
Psoriasis and vitiligo
రెండూ అంటు వ్యాధులు కావు – ముట్టుకుంటే రావు, కలిసి తింటే రావు. చికిత్సతో అదుపులో ఉంటాయి, కానీ సమయం పడుతుంది.
జుట్టు రాలడం & చుండ్రు
Hair fall and dandruff
రోజుకి వంద వెంట్రుకలు రాలడం మామూలే. అంతకంటే ఎక్కువైతే – రక్తహీనత, థైరాయిడ్, విటమిన్ లోపం, ఒత్తిడి – కారణం లోపల ఉండొచ్చు. పరీక్ష చేస్తే తెలుస్తుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు (తామర, గజ్జి)
Fungal infections
చెమట, తడి ఉండే చోట పెరిగే ఫంగస్. ఇది ఇంట్లో ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది – అందుకే ఇంట్లో అందరూ కలిసి చికిత్స తీసుకోవాలి.
కాలిన గాయాలు
Burns
వంటగదిలో, పొలంలో, పండుగలప్పుడు – ఇక్కడ సాధారణం. మొదటి పది నిమిషాల్లో ఏం చేస్తారు అనేదే మచ్చ ఉంటుందా లేదా అని నిర్ణయిస్తుంది.
సుఖ వ్యాధులు (STI)
Sexually transmitted infections
గుట్టుగా, తీర్పు లేకుండా చూస్తారు. చాలావరకు మందులతో పూర్తిగా తగ్గుతాయి – ఆలస్యం చేయడం వల్లే ఇబ్బంది, అలాగే భాగస్వామికి కూడా వెళ్తుంది.
జనరల్ & లాపరోస్కోపిక్ సర్జరీ· డా. వంశీ కృష్ణ
ఈ విభాగం ఆపరేషన్లు →ఈ విభాగంలో చేసేవి ఆపరేషన్లు – పైన లింక్ నొక్కండి.
ఆర్థోపెడిక్ (ఎముకలు & కీళ్లు)
ఈ విభాగం ఆపరేషన్లు →కీళ్ల & కండరాల నొప్పులు
Joint and muscle pain
వయసుతో వచ్చే అరుగుదల, యూరిక్ యాసిడ్, విటమిన్ డి లోపం, థైరాయిడ్ – కారణం ఒకటి కాదు. పరీక్ష చేయకుండా నొప్పి మాత్రలు వేసుకోవడం వల్లే చాలామందికి కడుపు, కిడ్నీ సమస్యలు వస్తాయి.
నడుము & మెడ నొప్పి
Back and neck pain
కూర్చునే పని, బరువులు, వయసుతో వచ్చే అరుగుదల – చాలావరకు విశ్రాంతి, వ్యాయామం, మందులతోనే తగ్గుతుంది. అన్ని నడుము నొప్పులకూ ఆపరేషన్ అవసరం లేదు.
రుమాటాయిడ్ (కీళ్ల వాపు)
Rheumatoid arthritis
శరీరం సొంత కీళ్ల మీదే దాడి చేయడం. ఉదయం లేచాక అరగంట పైగా బిగుసుకుపోవడం దీని గుర్తు. ముందుగా మొదలుపెడితే కీళ్లు వంకరపోకుండా ఆపొచ్చు.
సీరియస్ అయినప్పుడు – ఇక్కడే ఉన్నవి
ICU (ఐసీయూ)
ICU
పరిస్థితి సీరియస్గా ఉన్నప్పుడు – గుండెపోటు, తీవ్రమైన ఇన్ఫెక్షన్, విష ప్రభావం, ఊపిరి ఇబ్బంది – ప్రతి నిమిషం గమనిస్తూ చికిత్స చేసే విభాగం. కైకలూరులోనే ఉంది, ఏలూరు, విజయవాడ వెళ్లాల్సిన పని లేదు.
వెంటిలేటర్ సదుపాయం
Ventilator
సొంతంగా ఊపిరి తీసుకోలేని స్థితిలో, ఆ పని మిషన్ చేస్తుంది – శరీరం కోలుకునేంత వరకు. ఇది చికిత్స కాదు, కోలుకోవడానికి ఇచ్చే సమయం.
































