🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

వినికిడి లోపం

వినికిడి లోపం · చిత్రం

వినికిడి లోపం

Hearing loss

గులిమి లాంటి చిన్న కారణం నుంచి, చెవి పొర, నరం వరకు – ఏ దశలో సమస్య ఉందో పరీక్షతో తెలుస్తుంది. పిల్లల్లో ఆలస్యం చేస్తే మాట కూడా ఆలస్యమవుతుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: వినిపించట్లేదు · గట్టిగా చెప్పాలి · పిల్లాడు పలకట్లేదు · టీవీ సౌండ్ పెంచుతున్నారు

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·ఒక్కసారిగా వినికిడి పోవడం – ఇది అత్యవసరం, రోజులు ఆగొద్దు
  • ·చెవిలో శబ్దంతో పాటు తల తిరగడం
  • ·చెవి నుంచి రక్తం లేదా చీము
  • ·పిల్లాడు రెండేళ్లు వచ్చినా మాట్లాడకపోవడం

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·చెవి పరీక్ష, ఎండోస్కోపీ
  • ·గులిమి తీయడం – చాలామందికి అంతటితోనే వినికిడి తిరిగి వస్తుంది
  • ·వినికిడి పరీక్ష
  • ·అవసరమైతే గ్రోమెట్ లేదా పొర మరమ్మతు

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·ENT ఎండోస్కోపీ
  • ·వినికిడి పరీక్ష
  • ·డా. హారిక (MS, ENT)
  • ·గ్రోమెట్, టైంపానోప్లాస్టీ ఇక్కడే

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·ఒక్కసారిగా వినికిడి పోతే అదే రోజు రండి – త్వరగా మొదలుపెడితేనే తిరిగి వచ్చే అవకాశం
  • ·గట్టి శబ్దాల దగ్గర పని చేస్తే చెవులకు రక్షణ
  • ·పిల్లలు పలకకపోతే 'పెద్దయ్యాక మాట్లాడతాడు' అని ఆగొద్దు
Dr. Harikaడా. హారికMBBS., MS (ENT)సీనియర్ ENT సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి