
ముక్కు నుంచి రక్తం · చిత్రం
ముక్కు నుంచి రక్తం
Nose bleed
ముక్కు లోపలి పొరలో సన్నని నాళాలు పగలడం – ఎండ, పొడి గాలి, ముక్కు గీకడం, బీపీ, రక్తం పలచబడే మందులు. చాలావరకు ప్రమాదం కాదు, కానీ ఆగకపోతే చూపించాలి.
దీన్నే ఇలా కూడా అంటారు: ముక్కులో నుంచి రక్తం · ఎండకి రక్తం కారుతోంది · పిల్లాడికి ముక్కు రక్తం
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·ఇరవై నిమిషాలు నొక్కి పట్టుకున్నా ఆగకపోవడం
- ·ఎక్కువ రక్తం, తల తిరగడం
- ·దెబ్బ తగిలిన తర్వాత రక్తం
- ·మాటిమాటికీ రావడం
- ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·ఎండోస్కోప్‌తో ఎక్కడి నుంచి వస్తోందో చూసి, ఆ చోటుని కాటరైజ్ చేయడం
- ·అవసరమైతే ప్యాకింగ్
- ·బీపీ, రక్త పరీక్షలు
- ·మళ్ళీ రాకుండా ఏం చేయాలో చెప్పడం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·ENT ఎండోస్కోపీ – 24/7 అత్యవసర సేవలు
- ·24/7 ల్యాబ్
- ·డా. హారిక (MS, ENT)
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·ముందుకు వంగి కూర్చోండి – వెనక్కి వాలొద్దు, రక్తం గొంతులోకి పోతుంది
- ·ముక్కు మెత్తని భాగాన్ని రెండు వేళ్లతో పది నిమిషాలు ఆపకుండా నొక్కి పట్టుకోండి
- ·ముక్కు మీద, మెడ వెనుక చల్లని గుడ్డ
- ·ఆగాక కొన్ని గంటలు ముక్కు చీదొద్దు, గీకొద్దు
డా. హారికMBBS., MS (ENT)సీనియర్ ENT సర్జన్