
సైనస్ & ముక్కు ఎలర్జీ · చిత్రం
సైనస్ & ముక్కు ఎలర్జీ
Sinus and nasal allergy
దుమ్ము, చలి, పొగకు ముక్కు లోపలి పొర స్పందించి వాచిపోవడం. ఇదే ఎక్కువకాలం ఉంటే సైనస్‌లు మూసుకుపోయి తలనొప్పి, వాసన పోవడం వస్తాయి.
దీన్నే ఇలా కూడా అంటారు: సైనస్ · తుమ్ములు ఆగట్లేదు · ముక్కు దిబ్బడ · తలనొప్పి · వాసన రావట్లేదు
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·కళ్ల చుట్టూ వాపు లేదా చూపు మందగించడం
- ·తీవ్రమైన తలనొప్పితో జ్వరం
- ·మెడ బిగుసుకుపోవడం
- ·ముఖం ఒక వైపు వాపు
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·ఎండోస్కోప్‌తో ముక్కు లోపల పరీక్ష – దూలం వంకర, పాలిప్స్ ఉన్నాయా చూడటం
- ·ఎలర్జీ కారణం గురించి మాట్లాడటం
- ·స్ప్రే ఎలా వాడాలో చేసి చూపించడం – చాలామంది తప్పుగా వాడుతున్నారు
- ·మందులతో తగ్గకపోతే FESS గురించి చెప్పడం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·ENT ఎండోస్కోపీ
- ·డిజిటల్ X-ray
- ·డా. హారిక (MS, ENT)
- ·FESS, సెప్టోప్లాస్టీ ఇక్కడే
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·ఇంట్లో దుమ్ము, దిండ్లు, కార్పెట్ – వారానికోసారి ఎండలో వేయండి
- ·బండి మీద వెళ్లేటప్పుడు ముక్కుకు గుడ్డ
- ·సెలైన్ నీళ్లతో ముక్కు కడగడం రోజూ
- ·మెడికల్ షాపులో స్ప్రేలు నెలల తరబడి సొంతంగా వాడొద్దు – అలవాటైపోతుంది
డా. హారికMBBS., MS (ENT)సీనియర్ ENT సర్జన్