🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

చెవి నొప్పి & కారుడు

చెవి నొప్పి & కారుడు · చిత్రం

చెవి నొప్పి & కారుడు

Ear pain and discharge

చెవిలో ఇన్ఫెక్షన్, గులిమి, పొరకు చిల్లు – కారణం చూడకుండా చుక్కలు వేయడం వల్ల చాలామందికి పొర దెబ్బతింటుంది. ఎండోస్కోప్‌తో లోపల చూస్తేనే తెలుస్తుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: చెవి నొప్పి · చెవిలో నీరు కారుతోంది · చెవి దిబ్బడ · చెవిలో శబ్దం

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·చెవి నొప్పితో జ్వరం
  • ·చెవి వెనుక వాపు, ఎర్రబారడం
  • ·ముఖం ఒక వైపు లాగడం
  • ·తల తిరగడం, వాంతులు
  • ·వినికిడి ఒక్కసారిగా పోవడం

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·ఎండోస్కోప్‌తో చెవి లోపల పరీక్ష
  • ·గులిమి, చెత్త ఉంటే సురక్షితంగా తీయడం
  • ·వినికిడి పరీక్ష అవసరమైతే
  • ·పొరకు చిల్లు ఉంటే – మందులతో తగ్గుతుందా, కుట్టాలా అనేది చెప్పడం

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·ENT ఎండోస్కోపీ
  • ·డా. హారిక (MS, ENT)
  • ·24/7 ల్యాబ్
  • ·అవసరమైతే చెవి ఆపరేషన్ ఇక్కడే

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·చెవిలో చుక్కలు డాక్టర్ చెప్పకుండా వేయొద్దు – పొరకు చిల్లు ఉంటే ప్రమాదం
  • ·బడ్స్, పిన్ను, తాళంచెవి పెట్టొద్దు
  • ·చెవిలో నీళ్లు పడకుండా చూసుకోండి
  • ·నూనె, వెల్లుల్లి రసం పోయొద్దు
Dr. Harikaడా. హారికMBBS., MS (ENT)సీనియర్ ENT సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి