24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

అలసట, నీరసం · చిత్రం

అలసట, నీరసం

Tiredness and weakness

ఇది సోమరితనం కాదు, ఒక లక్షణం. రక్తహీనత, థైరాయిడ్, షుగర్, విటమిన్ బి12/డి లోపం, కిడ్నీ – వీటిలో ఏదైనా కావొచ్చు. ఒక్క రక్త పరీక్షతో చాలావరకు తేలిపోతుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: ఎప్పుడూ నీరసం · ఓపిక లేదు · నిద్ర సరిపోవట్లేదు · కళ్లు తిరుగుతున్నాయి

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·ఛాతీ నొప్పి లేదా ఊపిరి ఇబ్బందితో కలిసిన నీరసం
  • ·బరువు వేగంగా తగ్గడం
  • ·రక్తం పడటం – మలంలో, వాంతిలో, నెలసరిలో ఎక్కువ
  • ·కళ్లు తిరిగి పడిపోవడం

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·పూర్తి రక్త పరీక్ష – హిమోగ్లోబిన్, షుగర్, థైరాయిడ్, విటమిన్ బి12 & డి
  • ·కిడ్నీ, లివర్ పరీక్షలు
  • ·కారణం తేలాక దానికే చికిత్స – కారణం లేకుండా టానిక్కులు ఇవ్వరు

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·24/7 ల్యాబ్ – రిపోర్టులు 1–2 గంటల్లో
  • ·ఫుల్ బాడీ చెకప్ ప్యాకేజీ
  • ·డా. పర్వీన్ సుల్తానా – రాత్రింబవళ్లు

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·ఆకుకూరలు, పప్పులు, గుడ్లు – రక్తహీనత ఇక్కడ చాలా సాధారణం
  • ·మెడికల్ షాపులో టానిక్కులు కొనకండి – కారణం తెలియకుండా అవి పనిచేయవు
  • ·రోజూ ఏడు గంటల నిద్ర
  • ·పరీక్ష చేయించుకోండి – ఊహించొద్దు
Dr. Parveen Sultanaడా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి