
షుగర్ (డయాబెటిస్) · చిత్రం
షుగర్ (డయాబెటిస్)
Diabetes
రక్తంలో చక్కెర ఎక్కువై, కళ్లు, కిడ్నీలు, నరాలు, గుండె – అన్నిటినీ మెల్లగా దెబ్బతీస్తుంది. నొప్పి లేకుండానే జరుగుతుంది, అందుకే పరీక్ష చేయించుకోవడం ఒక్కటే దారి.
దీన్నే ఇలా కూడా అంటారు: షుగర్ ఎక్కువ · మూత్రం ఎక్కువ సార్లు · ఎంత తిన్నా నీరసం · బరువు తగ్గిపోతున్నాను
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·వాంతులు, పొట్ట నొప్పి, వేగంగా ఊపిరి
- ·స్పృహ తప్పడం, గందరగోళంగా మాట్లాడటం
- ·కాలికి పుండు, వాసన లేదా నలుపు
- ·షుగర్ బాగా తగ్గి చెమటలు, వణుకు
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·డాక్టర్ పరీక్ష చేసి, ఎంతకాలంగా ఉంది, ఏ మందులు వాడుతున్నారో చూస్తారు
- ·FBS/PP, HbA1c – మూడు నెలల సగటు తెలుస్తుంది
- ·కిడ్నీ, లివర్, కొలెస్ట్రాల్, కళ్లు, కాళ్ల పరీక్ష
- ·మందుల మోతాదు సర్దుబాటు, తిండి గురించి స్పష్టమైన సూచనలు
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·24/7 ల్యాబ్ – షుగర్ రిపోర్ట్ గంటలోపే
- ·HbA1c, కిడ్నీ & లివర్ పరీక్షలు
- ·ECG, 2D ఎకో
- ·కాలి పుండ్లకు డ్రెస్సింగ్ & సర్జన్ అభిప్రాయం
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·మందు రోజూ ఒకే సమయానికి – ఒక్క రోజు కూడా మానొద్దు
- ·షుగర్ తగ్గినప్పటి కోసం జేబులో బెల్లం/చక్కెర ఉంచుకోండి
- ·రోజూ కాళ్లు, పాదాల కింద చూసుకోండి – నొప్పి తెలియకుండానే పుండు అవుతుంది
- ·చెప్పుల్లేకుండా నడవొద్దు
- ·బాగుంది అనిపించినా మందు ఆపొద్దు – ఇది తగ్గే జబ్బు కాదు, అదుపులో ఉంచే జబ్బు
డా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్