
లివర్ సమస్యలు & కామెర్లు · చిత్రం
లివర్ సమస్యలు & కామెర్లు
Liver problems and jaundice
కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం. వైరస్, మద్యం, మందులు, పిత్తాశయ రాళ్లు – కారణం ఏదో పరీక్షతోనే తెలుస్తుంది. నాటు మందులతో కామెర్లు తగ్గవు, ఇంకా పాడవుతుంది.
దీన్నే ఇలా కూడా అంటారు: కామెర్లు · కళ్లు పచ్చగా · మూత్రం ఎర్రగా · లివర్ పాడైంది అన్నారు
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·వాంతులు ఆగకపోవడం
- ·గందరగోళంగా మాట్లాడటం, నిద్రమత్తు
- ·పొట్ట ఉబ్బడం, కాళ్ల వాపు
- ·వాంతిలో లేదా మలంలో రక్తం
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·LFT, హెపటైటిస్ పరీక్షలు
- ·పొట్ట అల్ట్రాసౌండ్
- ·కారణం చూసి చికిత్స; అవసరమైతే అడ్మిషన్, సెలైన్
- ·మద్యం అలవాటు ఉంటే దాని గురించి కూడా మాట్లాడతారు
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·LFT, హెపటైటిస్ ప్రొఫైల్ – 24/7 ల్యాబ్
- ·అల్ట్రాసౌండ్ స్కానింగ్
- ·అడ్మిషన్, ICU
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·మద్యం పూర్తిగా మానేయాలి
- ·నాటు మందులు, తాయెత్తులు, సొంత మాత్రలు వద్దు – లివర్‌కి అవే ఎక్కువ హాని
- ·తేలికైన ఇంటి భోజనం, నీళ్లు ఎక్కువ
- ·విశ్రాంతి
డా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్