🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

బి.పి. (రక్తపోటు)

బి.పి. (రక్తపోటు) · చిత్రం

బి.పి. (రక్తపోటు)

High blood pressure

రక్తనాళాల్లో ఒత్తిడి ఎక్కువై గుండె, మెదడు, కిడ్నీల మీద పడుతుంది. చాలామందికి ఏ లక్షణమూ ఉండదు – పక్షవాతం వచ్చాకే తెలుస్తుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: బీపీ ఎక్కువ · తల భారంగా · మెడ వెనక నొప్పి · కళ్లు తిరుగుతున్నాయి

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·ఛాతీ నొప్పి
  • ·ఒక వైపు చెయ్యి/కాలు బలహీనం, నోరు వంకర, మాట తడబడటం
  • ·ఒక్కసారిగా తీవ్రమైన తలనొప్పి
  • ·ఊపిరి ఆడకపోవడం
  • ·చూపు మసకబారడం

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·రెండు చేతుల్లో బీపీ చూసి, ECG తీసి, గుండె మీద ప్రభావం ఉందా చూస్తారు
  • ·కిడ్నీ పరీక్షలు, కొలెస్ట్రాల్
  • ·అవసరమైతే 2D ఎకో
  • ·మందు మొదలుపెట్టి, ఒక నెల తర్వాత మళ్ళీ చూసి సర్దుబాటు

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·ECG వెంటనే
  • ·2D ఎకో, TMT
  • ·24/7 ల్యాబ్
  • ·ICU – అవసరమైతే ఇక్కడే

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·ఉప్పు తగ్గించండి – ఊరగాయలు, అప్పడాలు, ప్యాకెట్ తినుబండారాలు
  • ·మందు రోజూ, అదే సమయానికి. బీపీ నార్మల్ వచ్చిందని ఆపొద్దు – మందు వల్లే నార్మల్‌గా ఉంది
  • ·రోజూ ముప్పై నిమిషాలు నడక
  • ·పొగ, మద్యం తగ్గించండి
Dr. Parveen Sultanaడా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి