🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

ఆస్తమా, ఆయాసం & ఊపిరితిత్తుల సమస్యలు

ఆస్తమా, ఆయాసం & ఊపిరితిత్తుల సమస్యలు · చిత్రం

ఆస్తమా, ఆయాసం & ఊపిరితిత్తుల సమస్యలు

Asthma and breathing problems

శ్వాస నాళాలు ఇరుకై గాలి ఆడకపోవడం. దుమ్ము, చలి, పొగ, జలుబు – వీటితో ఎక్కువవుతుంది. సరైన మందుతో మామూలు జీవితం గడపొచ్చు.

దీన్నే ఇలా కూడా అంటారు: ఆయాసం · ఊపిరి ఆడట్లేదు · ఆస్తమా · పిల్లికూతలు · మెట్లు ఎక్కలేకపోతున్నాను

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·మాటలు పూర్తి చేయలేనంత ఆయాసం
  • ·పెదాలు, గోళ్లు నీలంగా మారడం
  • ·ఇన్‌హేలర్ వేసినా తగ్గకపోవడం
  • ·కూర్చుంటేనే ఊపిరి ఆడటం, పడుకోలేకపోవడం

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·ఆక్సిజన్ శాతం చూసి, అవసరమైతే వెంటనే నెబ్యులైజేషన్
  • ·ఛాతీ X-ray, రక్త పరీక్షలు
  • ·ఇన్‌హేలర్ ఎలా వాడాలో చేసి చూపించడం – చాలామంది తప్పుగా వాడుతున్నారు
  • ·తగ్గకపోతే అడ్మిషన్, ఆక్సిజన్, అవసరమైతే ICU

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·నెబ్యులైజేషన్, ఆక్సిజన్ – 24/7
  • ·డిజిటల్ X-ray
  • ·ICU & వెంటిలేటర్
  • ·24/7 ఫార్మసీ – ఇన్‌హేలర్లు ఇక్కడే

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·ఇన్‌హేలర్ ఎప్పుడూ దగ్గర ఉంచుకోండి – ఇంట్లో ఒకటి, జేబులో ఒకటి
  • ·దుమ్ము, పొగ, అగరబత్తి పొగ, చలి గాలి తప్పించుకోండి
  • ·బాగున్నప్పుడు కూడా రోజువారీ ఇన్‌హేలర్ ఆపొద్దు – అదే మళ్ళీ రాకుండా ఆపేది
  • ·జలుబు వచ్చినప్పుడు జాగ్రత్త – అప్పుడే ఎక్కువవుతుంది
Dr. Parveen Sultanaడా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి