
జ్వరం, జలుబు & దగ్గు · చిత్రం
జ్వరం, జలుబు & దగ్గు
Fever, cold and cough
మూడు రోజులు దాటిన జ్వరం మామూలు జలుబు కాదు – డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, మూత్ర ఇన్ఫెక్షన్, న్యుమోనియా ఏదైనా కావొచ్చు. పరీక్ష చేస్తేనే తెలుస్తుంది.
దీన్నే ఇలా కూడా అంటారు: జ్వరం తగ్గట్లేదు · డెంగ్యూ ఏమో · టైఫాయిడ్ · వారం రోజులుగా దగ్గు
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం లేదా ఒంటి మీద ఎర్రని మచ్చలు
- ·ఊపిరి ఆడకపోవడం
- ·స్పృహ తప్పడం, మూర్చ
- ·మూత్రం తగ్గిపోవడం
- ·పసిపిల్లలకు, వృద్ధులకు జ్వరం – వేచి ఉండొద్దు
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·రక్త పరీక్షలు – ప్లేట్‌లెట్లు, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా
- ·అవసరమైతే ఛాతీ X-ray
- ·నీరసం ఎక్కువైతే సెలైన్, అడ్మిషన్
- ·ప్లేట్‌లెట్లు పడిపోతే రోజూ చూస్తూ ఉండటం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·24/7 ల్యాబ్ – రిపోర్ట్ ఒక గంటలో
- ·డిజిటల్ X-ray
- ·అడ్మిషన్, ICU
- ·24/7 ఫార్మసీ
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా
- ·సొంతంగా యాంటీబయాటిక్స్ వేసుకోవద్దు – జ్వరం ఏమిటో తెలియకుండా వేస్తే పరీక్షల్లో దొరకదు
- ·నొప్పి మాత్రలు (ఐబుప్రొఫెన్ లాంటివి) డెంగ్యూలో ప్రమాదం – డాక్టర్‌ని అడిగే వాడండి
- ·మూడు రోజులు దాటితే పరీక్ష చేయించండి
డా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్