🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

గ్యాస్, కడుపు ఉబ్బరం & జీర్ణ సమస్యలు

గ్యాస్, కడుపు ఉబ్బరం & జీర్ణ సమస్యలు · చిత్రం

గ్యాస్, కడుపు ఉబ్బరం & జీర్ణ సమస్యలు

Acidity and digestion problems

కడుపులో మంట, ఉబ్బరం, మలబద్ధకం – చాలావరకు తిండి, సమయం, ఒత్తిడి వల్లే. కానీ ఛాతీ మంటలా అనిపించేది గుండె నొప్పి కూడా కావొచ్చు, అందుకే ఒకసారి చూపించుకోవడం మంచిది.

దీన్నే ఇలా కూడా అంటారు: గ్యాస్ · కడుపు ఉబ్బరం · ఛాతీలో మంట · పుల్లని తేన్పులు · మలబద్ధకం

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·వాంతిలో రక్తం, లేదా నల్లని మలం
  • ·మింగడం కష్టం అవుతుండటం
  • ·కారణం లేకుండా బరువు తగ్గడం
  • ·ఛాతీ నొప్పితో చెమటలు, ఎడమ చేయి లాగడం – ఇది గుండె కావొచ్చు, వెంటనే రండి

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·పరీక్ష చేసి, ఎంతకాలంగా, ఎప్పుడు ఎక్కువ అవుతుందో చూస్తారు
  • ·అవసరమైతే ECG – గుండె కాదని నిర్ధారించుకోవడానికి
  • ·రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్
  • ·తిండి వేళల గురించి స్పష్టమైన సూచనలు

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·ECG వెంటనే
  • ·అల్ట్రాసౌండ్ స్కానింగ్
  • ·24/7 ల్యాబ్

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·రాత్రి తిన్న వెంటనే పడుకోవద్దు – రెండు గంటలు ఆగండి
  • ·తల వైపు మంచం కొంచెం ఎత్తుగా
  • ·కారం, నూనె, టీ/కాఫీ ఎక్కువ తగ్గించండి
  • ·పొగ, మద్యం మానండి
  • ·రోజూ ఒకే వేళకి తినండి – ఆకలితో ఎక్కువసేపు ఉండొద్దు
Dr. Parveen Sultanaడా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి