
ఫంగల్ ఇన్ఫెక్షన్లు (తామర, గజ్జి) · చిత్రం
ఫంగల్ ఇన్ఫెక్షన్లు (తామర, గజ్జి)
Fungal infections
చెమట, తడి ఉండే చోట పెరిగే ఫంగస్. ఇది ఇంట్లో ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది – అందుకే ఇంట్లో అందరూ కలిసి చికిత్స తీసుకోవాలి.
దీన్నే ఇలా కూడా అంటారు: తామర · గజ్జి · గుండ్రని మచ్చ · చెమట పట్టే చోట దురద
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·ఒళ్లంతా పాకడం
- ·చీము, నొప్పి
- ·షుగర్ ఉన్నవారికి – ఇది ఎక్కువ అవుతుంది
- ·క్రీము వాడాక ఇంకా పెరగడం
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·పరీక్ష, అవసరమైతే స్క్రాపింగ్
- ·ఎంతకాలం మందు వాడాలో స్పష్టంగా చెప్పడం – ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు
- ·షుగర్ పరీక్ష
- ·ఇంట్లో అందరికీ ఏం చేయాలో చెప్పడం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·డా. మేఘన వలేటి (MD, DVL)
- ·24/7 ల్యాబ్
- ·24/7 ఫార్మసీ
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·మచ్చ కనిపించకుండా పోయాక కూడా డాక్టర్ చెప్పినంత కాలం మందు వాడాలి – ముందే ఆపడం వల్లే మళ్ళీ వస్తుంది
- ·బట్టలు, తువ్వాళ్లు కలిసి వాడొద్దు; వేడి నీళ్లలో ఉతికి ఎండలో ఆరబెట్టండి
- ·వదులైన కాటన్ బట్టలు, చెమట ఆరనివ్వండి
- ·మెడికల్ షాపులో కలగలుపు క్రీములు వాడొద్దు – అవి ఫంగస్‌ను ఇంకా బలపరుస్తాయి
డా. మేఘన వలేటిMBBS., MD (DVL) – Gold Medalistసీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్