🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

దురద, తామర & ఎగ్జిమా

దురద, తామర & ఎగ్జిమా · చిత్రం

దురద, తామర & ఎగ్జిమా

Itching and eczema

ఎలర్జీ, పొడి చర్మం, సబ్బులు, ఫంగస్ – దురదకు కారణాలు వేరువేరు, చికిత్స కూడా వేరు. ఒకరికి పనిచేసిన క్రీము ఇంకొకరికి పెంచుతుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: దురద · ఒళ్లు గోక్కుంటున్నాను · ఎగ్జిమా · చర్మం పొడిబారి పగులుతోంది

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·ఒళ్లంతా వేగంగా పాకడం, జ్వరం
  • ·పెదాలు, కళ్లు వాపు, ఊపిరి ఇబ్బంది – ఇది ఎలర్జీ షాక్, వెంటనే
  • ·చీము, గాయాలు
  • ·మందు వేసుకున్నాక మొదలైన దద్దుర్లు

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·చర్మ పరీక్ష, అవసరమైతే స్క్రాపింగ్ – ఫంగస్ ఉందా చూడటానికి
  • ·ఏ సబ్బు, ఏ మందు వాడుతున్నారో అడిగి కారణం వెతకడం
  • ·కారణాన్ని బట్టి చికిత్స, ఎంతకాలం వాడాలో చెప్పడం

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·చర్మ వైద్య కన్సల్టేషన్ – డా. మేఘన వలేటి (MD, DVL)
  • ·24/7 ల్యాబ్
  • ·24/7 ఫార్మసీ

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·వేడి నీళ్ల స్నానం తగ్గించండి, మెత్తని సబ్బు
  • ·స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్
  • ·గోకొద్దు – గోకడం వల్లే ఇన్ఫెక్షన్ వస్తుంది
  • ·మెడికల్ షాపులో స్టెరాయిడ్ క్రీములు సొంతంగా వాడొద్దు – ముఖం మీద అవి చాలా హాని
Dr. Meghana Valetiడా. మేఘన వలేటిMBBS., MD (DVL) – Gold Medalistసీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి