🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

కాలిన గాయాలు

కాలిన గాయాలు · చిత్రం

కాలిన గాయాలు

Burns

వంటగదిలో, పొలంలో, పండుగలప్పుడు – ఇక్కడ సాధారణం. మొదటి పది నిమిషాల్లో ఏం చేస్తారు అనేదే మచ్చ ఉంటుందా లేదా అని నిర్ణయిస్తుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: కాలింది · వేడి నీళ్లు పడ్డాయి · నూనె పడింది · కాలిన మచ్చ

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·అరచేయి కంటే పెద్ద గాయం
  • ·ముఖం, చేతులు, కాళ్ల కీళ్లు, జననేంద్రియాల మీద
  • ·పొక్కులు, తెల్లగా లేదా నల్లగా మారడం
  • ·పిల్లలకు, వృద్ధులకు – ఏ కాలిన గాయమైనా
  • ·పొగ పీల్చడం, ఊపిరి ఇబ్బంది

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·గాయాన్ని శుభ్రం చేసి, ఎంత లోతో చూసి డ్రెస్సింగ్
  • ·టెటనస్, నొప్పి మందు, అవసరమైతే యాంటీబయాటిక్
  • ·పెద్ద గాయమైతే అడ్మిషన్, సెలైన్; ఇంకా పెద్దదైతే స్థిరపరిచి బర్న్స్ సెంటర్‌కి రిఫర్
  • ·మానాక మచ్చ తగ్గించే చికిత్స

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·24/7 అత్యవసర విభాగం
  • ·డ్రెస్సింగ్, అడ్మిషన్
  • ·డా. మేఘన వలేటి – మచ్చల చికిత్స
  • ·24/7 ఫార్మసీ

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·వెంటనే పారే చల్లని నీళ్ల కింద ఇరవై నిమిషాలు ఉంచండి – ఇదే అన్నిటికంటే ముఖ్యం
  • ·మంచు, ఐస్ పెట్టొద్దు
  • ·పసుపు, నూనె, టూత్‌పేస్ట్, కోడిగుడ్డు, ఇంకు – ఏదీ రాయొద్దు
  • ·పొక్కులు పగలగొట్టొద్దు
  • ·ఉంగరాలు, గాజులు, బిగుతు బట్టలు వెంటనే తీసేయండి
Dr. Meghana Valetiడా. మేఘన వలేటిMBBS., MD (DVL) – Gold Medalistసీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి