
సోరియాసిస్ & బొల్లి · చిత్రం
సోరియాసిస్ & బొల్లి
Psoriasis and vitiligo
రెండూ అంటు వ్యాధులు కావు – ముట్టుకుంటే రావు, కలిసి తింటే రావు. చికిత్సతో అదుపులో ఉంటాయి, కానీ సమయం పడుతుంది.
దీన్నే ఇలా కూడా అంటారు: పొలుసులు · తెల్ల మచ్చలు · బొల్లి · సోరియాసిస్
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·ఒళ్లంతా వేగంగా పాకడం
- ·కీళ్ల నొప్పి, వాపుతో కలిసి రావడం
- ·పొలుసులతో పాటు జ్వరం
- ·పెదాలు, కళ్ల దగ్గర తెల్ల మచ్చలు
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·పరీక్ష, ఎంత భాగం ఉందో చూడటం
- ·థైరాయిడ్, షుగర్ పరీక్షలు – వీటితో కలిసి వస్తాయి
- ·క్రీములు, మందులు; ఎంతకాలం అనేది స్పష్టంగా చెప్పడం
- ·మనసుకి ఇబ్బందిగా ఉంటే దాని గురించి కూడా మాట్లాడటం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·డా. మేఘన వలేటి (MD, DVL)
- ·24/7 ల్యాబ్ – థైరాయిడ్, షుగర్
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·చర్మం ఎప్పుడూ తడిగా – మాయిశ్చరైజర్ రోజూ
- ·గోకొద్దు, పొలుసులు ఒలవొద్దు
- ·నాటు మందులు, తాయెత్తులు వద్దు – చాలామంది వాటితోనే ఇంకా పెంచుకుంటారు
- ·ఇది ఇతరులకు అంటదు – ఇంట్లో వాళ్లకి అది చెప్పండి
డా. మేఘన వలేటిMBBS., MD (DVL) – Gold Medalistసీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్