24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

పిల్లల చర్మ సమస్యలు · చిత్రం

పిల్లల చర్మ సమస్యలు

Skin problems in children

దద్దుర్లు, పొక్కులు, డైపర్ దద్దు, తలలో పొట్టు – పిల్లల చర్మం సున్నితం, పెద్దవాళ్ల క్రీములు వాళ్లకి పనికిరావు. చాలావరకు సులభంగా తగ్గుతాయి, కారణం తెలిస్తే.

దీన్నే ఇలా కూడా అంటారు: పిల్లాడికి దద్దుర్లు · ఒళ్లంతా దురద · పొక్కులు · డైపర్ దగ్గర ఎర్రగా

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·జ్వరంతో కలిసిన దద్దుర్లు
  • ·పొక్కులు, చీము
  • ·నొక్కినా తగ్గని ఎర్రని మచ్చలు
  • ·పాలు తాగకపోవడం, నీరసం
  • ·పెదాలు/కళ్లు వాపు – వెంటనే

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·చర్మ పరీక్ష, ఎంతకాలంగా ఉందో, ఇంట్లో ఇంకెవరికైనా ఉందా చూడటం
  • ·ఫంగస్/గజ్జి అనుమానం ఉంటే స్క్రాపింగ్
  • ·పిల్లలకి సరిపడే మందు, ఎంత వాడాలో స్పష్టంగా
  • ·ఇంట్లో అందరికీ ఏం చేయాలో చెప్పడం

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·డా. మేఘన వలేటి (MD, DVL)
  • ·24/7 ల్యాబ్
  • ·24/7 ఫార్మసీ

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·పెద్దవాళ్ల స్టెరాయిడ్ క్రీములు పిల్లలకి రాయొద్దు – చాలా హాని
  • ·మెత్తని సబ్బు, గోరువెచ్చని నీళ్లు; స్నానం తర్వాత మాయిశ్చరైజర్
  • ·గోళ్లు కత్తిరించండి – గోకడం వల్లే ఇన్ఫెక్షన్
  • ·బట్టలు, తువ్వాళ్లు వేడి నీళ్లలో ఉతికి ఎండలో ఆరబెట్టండి
Dr. Meghana Valetiడా. మేఘన వలేటిMBBS., MD (DVL) – Gold Medalistసీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి