
కీళ్ల & కండరాల నొప్పులు · చిత్రం
కీళ్ల & కండరాల నొప్పులు
Joint and muscle pain
వయసుతో వచ్చే అరుగుదల, యూరిక్ యాసిడ్, విటమిన్ డి లోపం, థైరాయిడ్ – కారణం ఒకటి కాదు. పరీక్ష చేయకుండా నొప్పి మాత్రలు వేసుకోవడం వల్లే చాలామందికి కడుపు, కిడ్నీ సమస్యలు వస్తాయి.
దీన్నే ఇలా కూడా అంటారు: మోకాళ్ల నొప్పి · నడుము నొప్పి · ఒళ్లు నొప్పులు · మెట్లు ఎక్కలేకపోతున్నాను
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·కీలు వాచి, ఎర్రబడి, ముట్టుకుంటే వేడిగా ఉండటం
- ·జ్వరంతో కలిపి కీళ్ల నొప్పి
- ·కాళ్లు బలహీనపడటం, మూత్రం అదుపు తప్పడం
- ·దెబ్బ తగిలాక కదపలేకపోవడం
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·పరీక్ష, అవసరమైతే X-ray
- ·యూరిక్ యాసిడ్, విటమిన్ డి, థైరాయిడ్, RA పరీక్షలు
- ·కారణాన్ని బట్టి చికిత్స; అవసరమైతే ఆర్థోపెడిక్ అభిప్రాయం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·డిజిటల్ X-ray
- ·24/7 ల్యాబ్ – యూరిక్ యాసిడ్, విటమిన్ డి, RA ఫ్యాక్టర్
- ·ఆర్థోపెడిక్ సర్జన్ అభిప్రాయం
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·నొప్పి మాత్రలు తరచూ సొంతంగా వేసుకోవద్దు
- ·బరువు తగ్గితే మోకాళ్ల మీద భారం తగ్గుతుంది
- ·డాక్టర్ చెప్పిన వ్యాయామాలు రోజూ
- ·కింద కూర్చోవడం, మెట్లు తగ్గించండి
