
మడమ & మణికట్టు నొప్పి · చిత్రం
మడమ & మణికట్టు నొప్పి
Heel and wrist pain
మడమ నొప్పి చాలావరకు అరికాలి పొర వాపు – ఉదయం మొదటి అడుగే అన్నిటికంటే నొప్పి. మణికట్టు నొప్పితో వేళ్లు తిమ్మిరెక్కితే అది నరం నొక్కుకుపోవడం కావొచ్చు.
దీన్నే ఇలా కూడా అంటారు: ఉదయం లేచి కాలు పెడితే మడమ నొప్పి · మణికట్టు నొప్పి · వేళ్లు తిమ్మిరి · పట్టు తప్పుతోంది
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·దెబ్బ తర్వాత కదపలేకపోవడం
- ·వాపు, ఎరుపు, వేడితో కలిసిన నొప్పి
- ·వేళ్లు బలహీనపడటం, వస్తువులు జారిపోవడం
- ·రాత్రి నిద్ర పట్టనంత నొప్పి
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·పరీక్ష, అవసరమైతే X-ray
- ·యూరిక్ యాసిడ్, విటమిన్ డి, RA పరీక్షలు
- ·సరైన చెప్పులు, స్ప్లింట్, వ్యాయామాలు చెప్పడం
- ·తగ్గకపోతే ఆర్థోపెడిక్ సర్జన్ అభిప్రాయం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·డిజిటల్ X-ray
- ·24/7 ల్యాబ్ – విటమిన్ డి, యూరిక్ యాసిడ్, RA ఫ్యాక్టర్
- ·ఆర్థోపెడిక్ సర్జన్ అభిప్రాయం
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·మడమ నొప్పికి: మెత్తని చెప్పులు, ఉదయం లేవగానే అరికాలు సాగదీసే వ్యాయామం
- ·చల్లని కాపడం 15 నిమిషాలు
- ·బరువు తగ్గితే మడమ మీద భారం తగ్గుతుంది
- ·నొప్పి మాత్రలు తరచూ సొంతంగా వేసుకోవద్దు
