
రుమాటాయిడ్ (కీళ్ల వాపు) · చిత్రం
రుమాటాయిడ్ (కీళ్ల వాపు)
Rheumatoid arthritis
శరీరం సొంత కీళ్ల మీదే దాడి చేయడం. ఉదయం లేచాక అరగంట పైగా బిగుసుకుపోవడం దీని గుర్తు. ముందుగా మొదలుపెడితే కీళ్లు వంకరపోకుండా ఆపొచ్చు.
దీన్నే ఇలా కూడా అంటారు: కీళ్లు వాచాయి · ఉదయం బిగుసుకుపోతున్నాయి · రుమాటాయిడ్ · వేళ్లు వంకరపోతున్నాయి
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·కీలు వాచి, ఎర్రబడి, వేడిగా ఉండటం
- ·జ్వరంతో కలిసి కీళ్ల నొప్పి
- ·ఒక్కసారిగా కదపలేకపోవడం
- ·కీళ్లు వంకరపోవడం మొదలవడం
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·పరీక్ష, ఏ కీళ్లు, ఎన్ని అనేది చూడటం
- ·RA ఫ్యాక్టర్, CRP, ESR పరీక్షలు
- ·X-ray
- ·మందులు మొదలుపెట్టి, క్రమం తప్పకుండా రక్త పరీక్షలతో గమనించడం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·24/7 ల్యాబ్ – RA ఫ్యాక్టర్, CRP, ESR
- ·డిజిటల్ X-ray
- ·ఆర్థోపెడిక్ సర్జన్ అభిప్రాయం
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·మందు ఆపొద్దు – నొప్పి లేకపోయినా లోపల దెబ్బ కొనసాగుతుంది
- ·వేడి కాపడం, మెల్లని వ్యాయామం రోజూ
- ·కీళ్ల మీద భారం తగ్గించండి – బరువు తగ్గితే నొప్పి తగ్గుతుంది
- ·నాటు మందులు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు సొంతంగా వేయించుకోవద్దు
