
గుండె కవాటాలు & గుండె రంధ్రం · చిత్రం
గుండె కవాటాలు & గుండె రంధ్రం
Heart valve problems and hole in the heart
గుండె కవాటాలు సరిగ్గా మూయకపోవడం, లేదా గోడలో రంధ్రం. 2D ఎకోతో ఇక్కడే కచ్చితంగా తెలుస్తుంది. ఆపరేషన్ అవసరమైతే మాత్రం అది ఇక్కడ చేయరు – పెద్ద సెంటర్‌కి పంపుతారు.
దీన్నే ఇలా కూడా అంటారు: గుండెలో రంధ్రం · కవాటం సమస్య · గుండె శబ్దం ఉంది అన్నారు · పిల్లాడికి గుండె సమస్య
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·ఊపిరి ఆడకపోవడం
- ·పెదాలు, గోళ్లు నీలంగా మారడం
- ·పిల్లాడు పాలు తాగుతూ ఆయాసపడటం, బరువు పెరగకపోవడం
- ·కళ్లు తిరిగి పడిపోవడం
- ·జ్వరం ఎక్కువ రోజులు
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·2D ఎకో – ఏ కవాటం, ఎంత రంధ్రం, ఎంత తీవ్రత అనేది ఇక్కడే తేలుతుంది
- ·ECG, ఛాతీ X-ray, రక్త పరీక్షలు
- ·కార్డియాలజిస్ట్ చూసి, ఇప్పుడే ఆపరేషన్ అవసరమా లేదా అనేది చెప్పడం
- ·ఆపరేషన్ అవసరమైతే – రిపోర్టులతో సహా పెద్ద సెంటర్‌కి రిఫర్; ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అక్కడ ఖర్చు తగ్గే అవకాశం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·2D ఎకో, ECG, TMT
- ·కార్డియాలజిస్ట్ డా. దశరథ బొప్పన
- ·24/7 ల్యాబ్, X-ray
- ·24/7 అంబులెన్స్
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·గుండె ఆపరేషన్లు ఈ ఆసుపత్రిలో చేయరు – పరీక్షలు, అభిప్రాయం ఇక్కడే, ఆపరేషన్ పెద్ద సెంటర్‌లో
- ·పంటి చికిత్స, ఏ ఆపరేషన్ అయినా చేయించుకునే ముందు గుండె సమస్య ఉందని తప్పకుండా చెప్పండి
- ·డాక్టర్ రాసిన మందులు, చెక్‌అప్ తేదీలు మానొద్దు
- ·జ్వరం ఎక్కువ రోజులు ఉంటే తేలికగా తీసుకోవద్దు
డా. దశరథ్ బొప్పనMBBS., MD., DM (Cardiology), PDF Interventional Cardiology, EECCసీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్