24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

ఛాతీ నొప్పి – గుండెదా, గ్యాసా? · చిత్రం

ఛాతీ నొప్పి – గుండెదా, గ్యాసా?

Chest pain - heart or acidity

ఇదే అన్నిటికంటే ఎక్కువ మందిని ఆలస్యం చేయించే ప్రశ్న. గ్యాస్ నొప్పి, గుండె నొప్పి రెండూ ఒకేలా అనిపిస్తాయి – ECG పది నిమిషాల్లో తేడా చెబుతుంది. అనుమానం ఉంటే రావడమే సరైనది; గ్యాస్ అని తేలితే ఏమీ పోలేదు.

దీన్నే ఇలా కూడా అంటారు: ఛాతీలో మంట · గ్యాస్ లా ఉంది · ఛాతీ బరువు · గుండె నొప్పా అని భయం

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·ఇరవై నిమిషాలు దాటినా తగ్గని ఛాతీ బరువు
  • ·నొప్పితో పాటు చల్లని చెమటలు, వాంతి అనిపించడం
  • ·నొప్పి ఎడమ చేయి, దవడ, వీపులోకి పాకడం
  • ·నడిస్తే ఎక్కువై, ఆగితే తగ్గే నొప్పి
  • ·షుగర్ ఉన్నవారికి నొప్పి లేకుండానే – నీరసం, చెమటలు చాలు

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·వచ్చిన వెంటనే ECG – నిమిషాల్లో
  • ·అవసరమైతే ట్రోపోనిన్ రక్త పరీక్ష, 2D ఎకో
  • ·గుండె కాదని తేలితే, కడుపు కారణం చూసి దానికి చికిత్స
  • ·గుండె అయితే వెంటనే మందులు, ICU; పెద్ద చికిత్స కావాలంటే స్థిరపరిచి పంపడం

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·ECG – 24/7, వెంటనే
  • ·2D ఎకో, TMT
  • ·కార్డియాలజిస్ట్ డా. దశరథ బొప్పన
  • ·ICU, 24/7 అంబులెన్స్

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·అనుమానం వస్తే ఇంట్లో కూర్చుని ఆలోచించొద్దు – ECG కి ఖర్చు తక్కువ, ఆలస్యానికి ఎక్కువ
  • ·సొంతంగా బండి నడుపుకుంటూ రావొద్దు
  • ·గ్యాస్ మాత్రలు వేసుకుని చూద్దాం అని గంటలు గడపొద్దు
Dr. Dasarath Boppanaడా. దశరథ్ బొప్పనMBBS., MD., DM (Cardiology), PDF Interventional Cardiology, EECCసీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి