
గుండె వైఫల్యం & గుండె దడ · చిత్రం
గుండె వైఫల్యం & గుండె దడ
Heart failure and palpitations
గుండె సరిపడా రక్తాన్ని పంపలేకపోవడం – ఆయాసం, కాళ్ల వాపు, రాత్రి పడుకోలేకపోవడం. మందులతో చాలా వరకు మామూలుగా ఉండొచ్చు, కానీ మందు ఆపడం వల్లే చాలామంది మళ్ళీ చేరతారు.
దీన్నే ఇలా కూడా అంటారు: గుండె దడ · గుండె బలహీనత · కాళ్ల వాపు · పడుకుంటే ఊపిరి ఆడదు · గుండె పెరిగింది అన్నారు
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·పడుకుంటే ఊపిరి ఆడకపోవడం, రాత్రి ఉలిక్కిపడి లేవడం
- ·కాళ్ల వాపు వేగంగా పెరగడం
- ·ఒక్కసారిగా బరువు పెరగడం
- ·గుండె దడతో పాటు కళ్లు తిరగడం, స్పృహ తప్పడం
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·ECG, 2D ఎకో – గుండె ఎంత బలంగా పంపుతోందో తెలుస్తుంది
- ·ఛాతీ X-ray, రక్త పరీక్షలు
- ·మందుల సర్దుబాటు; ఉప్పు, నీళ్ల గురించి స్పష్టమైన సూచనలు
- ·కార్డియాలజిస్ట్ అభిప్రాయం – ప్రతి మంగళవారం సా. 5–7
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·ECG, 2D ఎకో, TMT
- ·కార్డియాలజిస్ట్ డా. దశరథ బొప్పన
- ·ICU, వెంటిలేటర్, ఆక్సిజన్
- ·24/7 ల్యాబ్
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·రోజూ ఒకే సమయానికి బరువు చూసుకోండి – రెండు రోజుల్లో రెండు కిలోలు పెరిగితే చూపించండి
- ·ఉప్పు తగ్గించండి, నీళ్లు డాక్టర్ చెప్పినంతే
- ·మందు ఒక్క రోజు కూడా మానొద్దు
- ·తల వైపు దిండ్లు ఎత్తుగా పెట్టుకుని పడుకోండి
డా. దశరథ్ బొప్పనMBBS., MD., DM (Cardiology), PDF Interventional Cardiology, EECCసీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్