
గుండెపోటు & గుండె సమస్యలు · చిత్రం
గుండెపోటు & గుండె సమస్యలు
Heart attack and heart problems
గుండెకు రక్తం ఆగిపోవడం. ప్రతి నిమిషం ముఖ్యం – మొదటి గంటలో చికిత్స మొదలైతే ప్రాణం, గుండె రెండూ కాపాడొచ్చు. చాలామంది గ్యాస్ అనుకుని ఆలస్యం చేస్తారు.
దీన్నే ఇలా కూడా అంటారు: ఛాతీ నొప్పి · గుండె నొప్పి · ఛాతీలో బరువు · గ్యాస్ లా ఉంది కానీ తగ్గట్లేదు
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·ఛాతీ మధ్యలో బరువు, నొప్పి – ఇరవై నిమిషాలు దాటినా తగ్గకపోతే
- ·నొప్పి ఎడమ చేయి, దవడ, వీపులోకి పాకడం
- ·చల్లని చెమటలు, వాంతి అనిపించడం
- ·ఒక్కసారిగా ఊపిరి ఆడకపోవడం
- ·షుగర్ ఉన్నవారికి నొప్పి లేకుండానే రావొచ్చు – నీరసం, చెమటలు చాలు
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·వచ్చిన వెంటనే ECG – నిమిషాల్లో
- ·అవసరమైన మందులు అప్పటికప్పుడు
- ·ట్రోపోనిన్ రక్త పరీక్ష, 2D ఎకో
- ·ICU పరిశీలన; పెద్ద చికిత్స కావాలంటే స్థిరపరిచి అంబులెన్స్‌లో పెద్ద సెంటర్‌కి పంపడం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·ECG, 2D ఎకో, TMT
- ·కార్డియాలజిస్ట్ డా. దశరథ బొప్పన
- ·ICU, వెంటిలేటర్, ఆక్సిజన్
- ·24/7 అంబులెన్స్
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·నొప్పి వస్తే ఇంట్లో కూర్చుని ఆలోచించొద్దు – వెంటనే బయలుదేరండి
- ·సొంతంగా బండి నడుపుకుంటూ రావొద్దు, ఎవరినైనా తీసుకురమ్మనండి
- ·9346113364 కి కాల్ చేస్తే అంబులెన్స్ వస్తుంది
డా. దశరథ్ బొప్పనMBBS., MD., DM (Cardiology), PDF Interventional Cardiology, EECCసీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్