
కిడ్నీ & మూత్ర సమస్యలు · చిత్రం
కిడ్నీ & మూత్ర సమస్యలు
Kidney and urine problems
మూత్ర ఇన్ఫెక్షన్, రాళ్లు, కిడ్నీ పనితీరు తగ్గడం – అన్నీ మొదట్లో చిన్నగానే కనిపిస్తాయి. షుగర్, బీపీ ఉన్నవారికి కిడ్నీ పరీక్ష ఏడాదికోసారి తప్పనిసరి.
దీన్నే ఇలా కూడా అంటారు: మూత్రం మంట · మూత్రం సరిగ్గా రావట్లేదు · కిడ్నీలో రాళ్లు · నడుము నొప్పి
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·మూత్రం అస్సలు రాకపోవడం
- ·జ్వరం, వణుకుతో పాటు నడుము నొప్పి
- ·మూత్రంలో రక్తం
- ·ముఖం, కాళ్ల వాపు
- ·ఆగని వాంతులు
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·మూత్ర పరీక్ష, క్రియాటినిన్, యూరియా
- ·పొట్ట/కిడ్నీ అల్ట్రాసౌండ్ – రాళ్లు ఉన్నాయా చూడటానికి
- ·ఇన్ఫెక్షన్ ఉంటే చికిత్స, నొప్పికి మందు
- ·పెద్ద రాయి లేదా డయాలసిస్ అవసరమైతే – ఇక్కడ చేయరు, పరీక్షలు చేసి పెద్ద సెంటర్‌కి రిఫర్ చేస్తారు
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·మూత్ర పరీక్ష, కిడ్నీ ప్రొఫైల్ – 24/7
- ·అల్ట్రాసౌండ్ స్కానింగ్
- ·అడ్మిషన్, సెలైన్
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·రోజుకి మూడు లీటర్ల నీళ్లు
- ·మూత్రం ఆపుకోవద్దు
- ·షుగర్, బీపీ అదుపులో ఉంచుకోవడమే కిడ్నీని కాపాడేది
- ·నొప్పి మాత్రలు తరచూ వేసుకోవద్దు – కిడ్నీకి హాని
డా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్