🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

ఫిట్స్ (మూర్చ)

ఫిట్స్ (మూర్చ) · చిత్రం

ఫిట్స్ (మూర్చ)

Fits and epilepsy

మెదడులో విద్యుత్ కదలిక ఒక్కసారిగా తేడా రావడం. మందులతో చాలామందికి పూర్తిగా ఆగిపోతాయి – మందు ఆపడం వల్లే మళ్ళీ వస్తాయి.

దీన్నే ఇలా కూడా అంటారు: ఫిట్స్ · మూర్చ · వణుకు వచ్చి పడిపోయారు · నురగ వచ్చింది

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·ఐదు నిమిషాలు దాటినా ఫిట్ ఆగకపోవడం
  • ·వరుసగా రెండు సార్లు రావడం
  • ·మధ్యలో స్పృహ రాకపోవడం
  • ·మొదటిసారి ఫిట్ రావడం
  • ·ఫిట్‌తో పాటు జ్వరం, తలనొప్పి

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·వెంటనే పరీక్ష, రక్తంలో షుగర్, సోడియం చూడటం
  • ·అవసరమైన మందులు; ఆగకపోతే ICU
  • ·కారణం తెలియాలంటే EEG/CT – అవి పెద్ద సెంటర్‌లో, రిఫర్ చేస్తారు
  • ·మందు మోతాదు సరిచేయడం, ఎప్పుడు మళ్ళీ చూపించాలో చెప్పడం

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·24/7 అత్యవసర చికిత్స
  • ·ల్యాబ్ – షుగర్, ఎలక్ట్రోలైట్లు
  • ·ICU, వెంటిలేటర్, ఆక్సిజన్

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·ఫిట్ వచ్చినప్పుడు: పక్కకి తిప్పి పడుకోబెట్టండి, తల కింద మెత్తగా పెట్టండి
  • ·నోట్లో ఏమీ పెట్టొద్దు – చెంచా, గుడ్డ, వేలు ఏదీ వద్దు. ఇది ప్రమాదం
  • ·పట్టుకుని ఆపడానికి ప్రయత్నించొద్దు; సమయం చూడండి
  • ·మందు ఒక్క రోజు కూడా మానొద్దు – ఆపడం వల్లే చాలామందికి మళ్ళీ వస్తాయి
  • ·ఈత, ఎత్తు పని, వంట మంట దగ్గర ఒంటరిగా వద్దు
Dr. Parveen Sultanaడా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి