
కుక్క కాటు · చిత్రం
కుక్క కాటు
Dog bite
రేబిస్ వచ్చాక చికిత్స లేదు – కానీ కాటు తర్వాత సరైన సమయంలో ఇంజెక్షన్లు వేయించుకుంటే పూర్తిగా ఆపొచ్చు. ఇంట్లో కుక్క అయినా, చిన్న గీత అయినా అదే నియమం.
దీన్నే ఇలా కూడా అంటారు: కుక్క కరిచింది · పిల్లి గీరింది · కోతి కరిచింది
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·ప్రతి కాటుకీ – అదే రోజు
- ·ముఖం, మెడ, చేతులు – ఇక్కడ కరిస్తే ఇంకా వేగంగా రావాలి
- ·లోతైన గాయం, ఆగని రక్తస్రావం
- ·గాయం ఎర్రబడి, చీము, జ్వరం
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·గాయాన్ని పూర్తిగా కడిగి శుభ్రం చేయడం – ఇదే మొదటి, ముఖ్యమైన పని
- ·రేబిస్ ఇంజెక్షన్ షెడ్యూల్ మొదలుపెట్టి, తేదీలు రాసి ఇవ్వడం
- ·అవసరమైతే టెటనస్, యాంటీబయాటిక్స్
- ·లోతైన గాయమైతే డ్రెస్సింగ్, కుట్లు
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·24/7 అత్యవసర విభాగం
- ·24/7 ఫార్మసీ
- ·గాయం డ్రెస్సింగ్, కుట్లు
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·వెంటనే పారే నీళ్లతో, సబ్బుతో పదిహేను నిమిషాలు కడగండి – ఇది చాలా ముఖ్యం
- ·గాయానికి పసుపు, నూనె, మిరప, ఆకుపసర్లు రాయొద్దు
- ·గాయాన్ని కుట్టించాలని తొందరపడొద్దు – డాక్టర్ నిర్ణయిస్తారు
- ·ఇంజెక్షన్ తేదీలు ఒక్కటి కూడా మానొద్దు – మధ్యలో ఆపితే వేసినవి వృథా
డా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్