
కుష్ఠు వ్యాధి · చిత్రం
కుష్ఠు వ్యాధి
Leprosy
చర్మం మీద మచ్చ, ఆ మచ్చ మీద స్పర్శ తెలియకపోవడం – ఇదే మొదటి గుర్తు. మందులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది, పూర్తిగా నయమవుతుంది. మందు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఇతరులకు అంటదు.
దీన్నే ఇలా కూడా అంటారు: తిమ్మిరి మచ్చ · మచ్చ మీద స్పర్శ తెలియట్లేదు · చేతివేళ్లు బలహీనం
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·మచ్చ మీద స్పర్శ తెలియకపోవడం
- ·చేతివేళ్లు, కాలివేళ్లు బలహీనపడటం
- ·కంటి రెప్ప మూయలేకపోవడం
- ·తెలియకుండానే కాలిన/తెగిన గాయాలు
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·చర్మ పరీక్ష, స్పర్శ పరీక్ష, అవసరమైతే స్క్రాపింగ్
- ·చికిత్స మొదలుపెట్టడం – పూర్తి కోర్సు
- ·నరాల బలహీనత ఉంటే దాన్ని ప్రత్యేకంగా చూడటం
- ·ఇంట్లో వాళ్లకి కూడా పరీక్ష
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·డా. మేఘన వలేటి (MD, DVL)
- ·24/7 ల్యాబ్
- ·గాయాలకు డ్రెస్సింగ్
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·మందు కోర్సు పూర్తి చేయాలి – మధ్యలో ఆపడం వల్లే నరాలు దెబ్బతింటాయి
- ·స్పర్శ తెలియని చేతులు, కాళ్లు రోజూ చూసుకోవాలి – గాయం తెలియకుండానే అవుతుంది
- ·చెప్పుల్లేకుండా నడవొద్దు; వేడి వస్తువులు పట్టుకునేటప్పుడు జాగ్రత్త
- ·ఇది సిగ్గుపడే వ్యాధి కాదు, మందుతో తగ్గే వ్యాధి – ఆలస్యమే అసలు నష్టం
డా. మేఘన వలేటిMBBS., MD (DVL) – Gold Medalistసీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్