
పాము కాటు · చిత్రం
పాము కాటు
Snake bite
పొలం పని, రాత్రి నడక – ఇక్కడ ఇది అరుదు కాదు. విషం ఉందా లేదా అనేది చూసి చెప్పలేరు, గంటల తర్వాతే బయటపడొచ్చు. అందుకే ప్రతి కాటుకీ ఆసుపత్రికి రావాలి.
దీన్నే ఇలా కూడా అంటారు: పాము కరిచింది · పొలంలో కరిచింది · కాలికి కాటు
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·ప్రతి పాము కాటుకీ – వెంటనే, ఏ లక్షణం లేకపోయినా
- ·కనురెప్పలు వాలిపోవడం, రెండుగా కనిపించడం
- ·ఊపిరి ఇబ్బంది, మింగలేకపోవడం
- ·మూత్రం ఎర్రగా/నల్లగా రావడం
- ·కాటు చోట వాపు పైకి పాకడం
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·వెంటనే పరీక్ష, రక్తం గడ్డకట్టే పరీక్ష, పరిశీలన
- ·విషం లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స మొదలు
- ·ఊపిరి మీద ప్రభావం పడితే ICU, వెంటిలేటర్ ఇక్కడే
- ·లక్షణాలు లేకపోయినా కనీసం 24 గంటలు గమనింపు
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·24/7 అత్యవసర విభాగం – ఏ రాత్రయినా
- ·ICU & వెంటిలేటర్
- ·24/7 ల్యాబ్
- ·24/7 అంబులెన్స్ – 9346113364
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·కట్టు గట్టిగా కట్టొద్దు, కోయొద్దు, నోటితో పీల్చొద్దు, మంత్రాల కోసం ఆగొద్దు – ఈ నాలుగే ప్రాణాలు తీస్తున్నాయి
- ·కరిచిన భాగాన్ని కదపకుండా, గుండె కంటే కిందుగా ఉంచండి
- ·నడిపించొద్దు – మోసుకుని లేదా బండి మీద తీసుకురండి
- ·ఉంగరాలు, గాజులు, చెప్పులు వెంటనే తీసేయండి – వాపు వస్తుంది
- ·పామును పట్టుకోవడానికి, చంపడానికి సమయం వృథా చేయొద్దు
డా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్