
పార్కిన్సన్ (వణుకు వ్యాధి) · చిత్రం
పార్కిన్సన్ (వణుకు వ్యాధి)
Parkinsons disease
మెదడులోని ఒక భాగం నెమ్మదిగా బలహీనపడి, కదలికలు నిదానించడం, వణుకు, బిగువు వస్తాయి. మందులతో చాలా వరకు మామూలుగా ఉండగలరు.
దీన్నే ఇలా కూడా అంటారు: చేతులు వణుకుతున్నాయి · నడక మెల్లగా అయ్యింది · మాట తగ్గింది · బిగుసుకుపోతున్నారు
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·ఒక్కసారిగా కదలలేకపోవడం
- ·పడిపోవడం, తలకు దెబ్బ
- ·మింగడం కష్టం, దగ్గు వస్తుండటం
- ·గందరగోళం, భ్రమలు
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·పరీక్ష చేసి ఎంతకాలంగా, ఏ మందులు వాడుతున్నారో చూడటం
- ·ఇతర కారణాలు (థైరాయిడ్, మందుల ప్రభావం) పరీక్షించడం
- ·మందు మోతాదు సర్దుబాటు, ఇంట్లో జాగ్రత్తల గురించి కుటుంబంతో మాట్లాడటం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·జనరల్ మెడిసిన్ కన్సల్టేషన్
- ·24/7 ల్యాబ్
- ·పడిపోతే అత్యవసర చికిత్స, X-ray
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·మందు సరిగ్గా అదే సమయానికి – ఆలస్యమైతే కదలిక నిలిచిపోతుంది
- ·ఇంట్లో జారే నేల, చాప, వైర్లు తీసేయండి; బాత్‌రూంలో పట్టుకునే రాడ్
- ·రోజూ నడక, వ్యాయామం
- ·మింగడం కష్టమైతే మెత్తని ఆహారం, కూర్చునే తినిపించండి
డా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్