24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

గురక / స్లీప్ ఆప్నియా ఆపరేషన్ (UPPP) · AI చిత్రం

గురక / స్లీప్ ఆప్నియా ఆపరేషన్ (UPPP)

Uvulopalatopharyngoplasty (UPPP)

మత్తు: జనరల్ సాధారణంగా 1–2 రోజులుడా. హారిక

గొంతులో వదులైన కణజాలం ఊపిరికి అడ్డుపడితే. నిద్ర పరీక్ష (స్లీప్ స్టడీ) చేశాక, ఎంపిక చేసిన వాళ్ళకే – అందరికీ కాదు

ఎలా చేస్తారు

గొంతులో వదులై ఊపిరికి అడ్డుపడుతున్న మృదు కణజాలాన్ని సరిచేసి, గాలి దారిని వెడల్పు చేస్తారు. ముందు నిద్ర పరీక్ష (స్లీప్ స్టడీ) తప్పనిసరి – గురక ఉన్న అందరికీ ఈ ఆపరేషన్ పనికిరాదు, ఎవరికి పనికొస్తుందో ఆ పరీక్షే చెబుతుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: గురక · నిద్రలో ఊపిరి ఆగుతోంది · పగలంతా నిద్ర · స్లీప్ ఆప్నియా

ఖర్చు

  • సర్జన్ ఫీజు – ప్రస్తుతం వసూలు చేయడం లేదు
  • జనరల్ రూమ్ ఛార్జ్ – ప్రస్తుతం వసూలు చేయడం లేదు
  • మీరు చెల్లించేవి – టెస్టులు, అనస్థీషియా (మత్తు), మందులు

మీకు ఆపరేషన్ అవసరమా, ఎంతవుతుందో డాక్టర్ పరీక్ష చేశాక, అడ్మిషన్ ముందే చెబుతారు.

హాస్పిటల్ ఛార్జీలు – పూర్తి వివరాలు →

ఇది ఆపరేషన్ – తెలిసి ఉండాల్సినవి

ఏ ఆపరేషన్‌కైనా మత్తు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్, గాయం ఆలస్యంగా మానడం వంటి సమస్యలు రావచ్చు; కొందరికి మళ్ళీ చేయాల్సి రావచ్చు. మీకు ఇది అవసరమా, మీ షుగర్, బి.పి., గుండె పరిస్థితితో సరిపోతుందా అన్నది పరీక్ష, టెస్టుల తర్వాతే డాక్టర్ నిర్ణయిస్తారు. సమ్మతి పత్రం తీసుకునే ముందు మీ ఆపరేషన్‌కి ఉన్న ప్రమాదాలను ఆయన విడిగా వివరిస్తారు – అడగడానికి సంకోచించకండి.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
  • ·జలుబు, జ్వరం ఉంటే ముందే చెప్పండి – తేదీ మార్చాల్సి రావొచ్చు
  • ·పండుగ రోజు (సెలవు) ENT ఆపరేషన్లు జరగవు – డాక్టర్‌తో తేదీ ఖాయం చేసుకోండి

తర్వాత ఏం చేయాలి

  • ·చల్లని, మెత్తని ఆహారం – ఐస్‌క్రీం, పెరుగన్నం, జావ, చల్లని పాలు
  • ·నీళ్లు బాగా తాగండి – గొంతు తడిగా ఉంటే నొప్పి తక్కువ
  • ·మింగడం నొప్పిగా ఉన్నా మింగుతూ ఉండాలి – మానేస్తే ఇంకా నొప్పి
  • ·గొంతు వెనుక తెల్లగా పొర కడుతుంది – అది మామూలే, అదే మానడం

ఏం చేయకూడదు

  • ·కారం, మసాలా, వేడి పదార్థాలు, గట్టివి (చిప్స్, బిస్కెట్)
  • ·గొంతు గట్టిగా సవరించుకోవడం, గట్టిగా దగ్గడం
  • ·రెండు వారాలు పాఠశాల/పని ఒత్తిడి, పరుగు, ఈత

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·ఉమ్మిలో ఎర్రని రక్తం (ఐదు నుంచి పది రోజుల మధ్య ఎక్కువ జాగ్రత్త) – వెంటనే, ఏ సమయంలోనైనా
  • ·జ్వరం
  • ·నీళ్లు కూడా మింగలేకపోవడం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Harikaడా. హారికMBBS., MS (ENT)ENT సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి