🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

సెప్టోప్లాస్టీ (ముక్కు దూలం సరిచేయడం)

Septoplasty

మత్తు: జనరల్ సాధారణంగా 1–2 రోజులు

టర్బినేట్ తగ్గింపుతో కలిపి చేస్తారు; సైనస్ సమస్య కూడా ఉంటే FESS అదే సమయంలో

ఎలా చేస్తారు

ముక్కు లోపలి నుంచే వంకర ఎముక/మృదులాస్థిని సరిచేస్తారు. ముఖం మీద కోత ఉండదు, ముక్కు ఆకారం మారదు.

దీన్నే ఇలా కూడా అంటారు: ముక్కు దూలం వంకర · ఒక వైపు ముక్కు మూసుకుపోవడం · deviated septum

సెప్టోప్లాస్టీ (ముక్కు దూలం సరిచేయడం)
సెప్టోప్లాస్టీ (ముక్కు దూలం సరిచేయడం) · చిత్రం

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్

సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
  • ·ముక్కులో వాడే స్ప్రేలు, రక్తం పలచబడే మందులు – ముందే చెప్పండి
  • ·పండుగ రోజు (సెలవు) ENT ఆపరేషన్లు జరగవు

తర్వాత ఏం చేయాలి

  • ·తల ఎత్తుగా పెట్టుకుని పడుకోండి – రెండు దిండ్లు; వాపు, రక్తం తగ్గుతాయి
  • ·డాక్టర్ ఇచ్చిన సెలైన్ స్ప్రే/నీళ్లతో ముక్కు కడగడం క్రమం తప్పకుండా
  • ·నోటితో ఊపిరి కొన్ని రోజులు మామూలే
  • ·చెప్పిన రోజు ముక్కు లోపల శుభ్రం చేయించుకోవడానికి తప్పకుండా రండి – ఇది ఆపరేషన్‌లో సగం

ఏం చేయకూడదు

  • ·ముక్కు చీదడం – రెండు వారాలు అస్సలు వద్దు (తుమ్ము వస్తే నోరు తెరిచి తుమ్మండి)
  • ·ముక్కులో వేలు పెట్టడం, పొర ఒలవడం
  • ·వంగడం, బరువులు ఎత్తడం, వేడి నీళ్ల స్నానం
  • ·ధూమపానం, దుమ్ము ఉన్న చోట పని

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·ఆగని రక్తస్రావం
  • ·జ్వరం
  • ·కళ్ల చుట్టూ వాపు లేదా చూపు మందగించడం
  • ·తీవ్రమైన తలనొప్పి

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Harikaడా. హారికMBBS., MS (ENT)సీనియర్ ENT సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి