🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

మైరింగోప్లాస్టీ

Myringoplasty

మత్తు: జనరల్ సాధారణంగా 1–2 రోజులు

వినికిడి ఎముకలు బాగుంటే – పొరకి మాత్రమే మరమ్మతు, చిన్న ఆపరేషన్

ఎలా చేస్తారు

చెవి పొరకు మాత్రమే మరమ్మతు – వినికిడి ఎముకలు బాగుంటే ఇది చాలు. చిన్న ఆపరేషన్.

దీన్నే ఇలా కూడా అంటారు: చెవి పొర చిల్లు

మైరింగోప్లాస్టీ
మైరింగోప్లాస్టీ · చిత్రం

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్

సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
  • ·జలుబు ఉంటే చెప్పండి – ముక్కు, చెవి కలిసే ఉంటాయి
  • ·పాత వినికిడి పరీక్ష రిపోర్టులు తీసుకురండి

తర్వాత ఏం చేయాలి

  • ·చెవిని పూర్తిగా పొడిగా ఉంచండి – స్నానం చేసేటప్పుడు దూదికి కొంచెం వాసెలిన్ రాసి పెట్టండి
  • ·డాక్టర్ చెప్పిన రోజు కట్టు మార్పించుకోండి
  • ·వినికిడి కొన్ని వారాలు మసకగా ఉండొచ్చు – వాపు తగ్గాక మెరుగవుతుంది

ఏం చేయకూడదు

  • ·చెవిలో నీళ్లు పోవడం – ఈత, తలస్నానం జాగ్రత్త (డాక్టర్ సరే అనేవరకు)
  • ·ముక్కు గట్టిగా చీదడం – అది నేరుగా చెవి మీద ఒత్తిడి
  • ·చెవిలో ఏదైనా పెట్టడం, బడ్స్ వాడడం
  • ·విమాన ప్రయాణం – డాక్టర్‌ని అడిగాకే

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·చెవి నుంచి చీము లేదా వాసన
  • ·జ్వరం
  • ·తల తిరగడం, వాంతులు
  • ·ముఖం ఒక వైపు లాగడం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Harikaడా. హారికMBBS., MS (ENT)సీనియర్ ENT సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి