టాన్సిలెక్టమీ (టాన్సిల్స్ తొలగింపు)
Tonsillectomy
ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: నోరు తెరవలేకపోవడం, ఉమ్మి కూడా మింగలేకపోవడం, ఊపిరి ఇబ్బంది
ఏడాదికి పదేపదే గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంటే, లేదా రాత్రి గురక/నిద్రలో ఊపిరి ఆగిపోతుంటే
ఎలా చేస్తారు
నోటి ద్వారానే టాన్సిల్స్ తీసేస్తారు – బయట ఎక్కడా కోత ఉండదు, మచ్చ ఉండదు.
దీన్నే ఇలా కూడా అంటారు: టాన్సిల్స్ · గొంతులో గడ్డలు · మాటిమాటికీ గొంతు నొప్పి · పిల్లాడికి గురక

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్
సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.
ఆపరేషన్ ముందు, తర్వాత
ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.
ముందు ఏం చేయాలి
- ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
- ·జలుబు, జ్వరం ఉంటే ముందే చెప్పండి – తేదీ మార్చాల్సి రావొచ్చు
- ·పండుగ రోజు (సెలవు) ENT ఆపరేషన్లు జరగవు – డాక్టర్‌తో తేదీ ఖాయం చేసుకోండి
తర్వాత ఏం చేయాలి
- ·చల్లని, మెత్తని ఆహారం – ఐస్‌క్రీం, పెరుగన్నం, జావ, చల్లని పాలు
- ·నీళ్లు బాగా తాగండి – గొంతు తడిగా ఉంటే నొప్పి తక్కువ
- ·మింగడం నొప్పిగా ఉన్నా మింగుతూ ఉండాలి – మానేస్తే ఇంకా నొప్పి
- ·గొంతు వెనుక తెల్లగా పొర కడుతుంది – అది మామూలే, అదే మానడం
ఏం చేయకూడదు
- ·కారం, మసాలా, వేడి పదార్థాలు, గట్టివి (చిప్స్, బిస్కెట్)
- ·గొంతు గట్టిగా సవరించుకోవడం, గట్టిగా దగ్గడం
- ·రెండు వారాలు పాఠశాల/పని ఒత్తిడి, పరుగు, ఈత
ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి
- ·ఉమ్మిలో ఎర్రని రక్తం (ఐదు నుంచి పది రోజుల మధ్య ఎక్కువ జాగ్రత్త) – వెంటనే, ఏ సమయంలోనైనా
- ·జ్వరం
- ·నీళ్లు కూడా మింగలేకపోవడం
ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364
డా. హారికMBBS., MS (ENT)సీనియర్ ENT సర్జన్