ముక్కు ఎముక విరగడం
Nasal bone fracture
ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: ఆగని రక్తస్రావం, ఊపిరి తీసుకోలేకపోవడం
దెబ్బ తగిలిన మొదటి రెండు వారాల్లో సరిచేస్తే ఆకారం బాగా కుదురుతుంది
ఎలా చేస్తారు
విరిగిన ముక్కు ఎముకను సరైన చోటుకు తీసుకొచ్చి కట్టు వేస్తారు. దెబ్బ తగిలిన రెండు వారాల్లోపు చేస్తే ఫలితం బాగుంటుంది.
దీన్నే ఇలా కూడా అంటారు: దెబ్బ తగిలి ముక్కు వంకర · ముక్కు ఎముక విరిగింది

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్
సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.
ఆపరేషన్ ముందు, తర్వాత
ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.
ముందు ఏం చేయాలి
- ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
- ·ముక్కులో వాడే స్ప్రేలు, రక్తం పలచబడే మందులు – ముందే చెప్పండి
- ·పండుగ రోజు (సెలవు) ENT ఆపరేషన్లు జరగవు
తర్వాత ఏం చేయాలి
- ·తల ఎత్తుగా పెట్టుకుని పడుకోండి – రెండు దిండ్లు; వాపు, రక్తం తగ్గుతాయి
- ·డాక్టర్ ఇచ్చిన సెలైన్ స్ప్రే/నీళ్లతో ముక్కు కడగడం క్రమం తప్పకుండా
- ·నోటితో ఊపిరి కొన్ని రోజులు మామూలే
- ·చెప్పిన రోజు ముక్కు లోపల శుభ్రం చేయించుకోవడానికి తప్పకుండా రండి – ఇది ఆపరేషన్‌లో సగం
ఏం చేయకూడదు
- ·ముక్కు చీదడం – రెండు వారాలు అస్సలు వద్దు (తుమ్ము వస్తే నోరు తెరిచి తుమ్మండి)
- ·ముక్కులో వేలు పెట్టడం, పొర ఒలవడం
- ·వంగడం, బరువులు ఎత్తడం, వేడి నీళ్ల స్నానం
- ·ధూమపానం, దుమ్ము ఉన్న చోట పని
ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి
- ·ఆగని రక్తస్రావం
- ·జ్వరం
- ·కళ్ల చుట్టూ వాపు లేదా చూపు మందగించడం
- ·తీవ్రమైన తలనొప్పి
ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364
డా. హారికMBBS., MS (ENT)సీనియర్ ENT సర్జన్