🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

పైలోనిడల్ సైనస్

Pilonidal sinus

మత్తు: స్పైనల్ లేదా జనరల్ సాధారణంగా 1–2 రోజులు

వెంట్రుకల వల్ల ఏర్పడే చీము దారి

ఎలా చేస్తారు

వెంట్రుకలు ఇరుక్కున్న గొట్టాన్ని మొత్తం తీసేసి, గాయాన్ని కుట్టేస్తారు లేదా బయట నుంచి మానేలా వదులుతారు.

దీన్నే ఇలా కూడా అంటారు: టెయిల్ బోన్ దగ్గర గడ్డ · వెన్ను చివర రంధ్రం · నడుము కింద చీము

పైలోనిడల్ సైనస్
పైలోనిడల్ సైనస్ · చిత్రం

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్

సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు – డాక్టర్ చెప్పినట్టు
  • ·రక్తం పలచబడే మందులు (aspirin, clopidogrel) వాడుతుంటే ముందే చెప్పండి
  • ·పాత రిపోర్టులు, మందుల చీటీ తీసుకురండి

తర్వాత ఏం చేయాలి

  • ·రోజుకి రెండు మూడు సార్లు గోరువెచ్చని నీళ్లలో 10 నిమిషాలు కూర్చోవడం (sitz bath) – ఇదే నొప్పి తగ్గించే అసలు పని
  • ·పీచు ఎక్కువ ఉన్న ఆహారం – ఆకుకూరలు, పండ్లు; రోజుకి 3 లీటర్ల నీళ్లు
  • ·మలం మెత్తగా ఉండేలా డాక్టర్ ఇచ్చిన మందు తప్పకుండా వాడాలి
  • ·నడవండి – మంచం మీదే ఉండిపోకండి

ఏం చేయకూడదు

  • ·మలవిసర్జన సమయంలో ముక్కడం (బలవంతం) – కుట్లు విడిపోతాయి
  • ·గట్టి కుర్చీ మీద, నేల మీద ఎక్కువసేపు కూర్చోవడం
  • ·కారం, మసాలా – కొన్ని రోజులు తగ్గించండి
  • ·బరువులు ఎత్తడం, బైక్ ఎక్కువ దూరం నడపడం (రెండు వారాలు)

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·ఆగని రక్తస్రావం
  • ·మూత్రం రాకపోవడం
  • ·జ్వరం, చలి
  • ·నొప్పి తగ్గకుండా పెరగడం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Vamsi Krishnaడా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి