🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

చిన్న శస్త్రచికిత్సలు & కుట్లు

Minor procedures & suturing

మత్తు: లోకల్ డే-కేర్ – అదే రోజు ఇంటికి

ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: ఆగని రక్తస్రావం – ఇప్పుడే రండి

24/7 చేస్తారు

ఎలా చేస్తారు

గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేస్తారు. అవసరమైతే టెటనస్ ఇంజెక్షన్ కూడా. 24/7 అందుబాటులో.

దీన్నే ఇలా కూడా అంటారు: కుట్లు · stitches · గాయం · డ్రెస్సింగ్

చిన్న శస్త్రచికిత్సలు & కుట్లు
చిన్న శస్త్రచికిత్సలు & కుట్లు · చిత్రం

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్

సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆ చోట క్రీములు, నూనెలు రాయకండి
  • ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే చెప్పండి
  • ·షుగర్ ఉంటే చెప్పండి – మానడం నెమ్మదిగా ఉంటుంది

తర్వాత ఏం చేయాలి

  • ·కట్టు పొడిగా ఉంచండి; డాక్టర్ చెప్పిన రోజు డ్రెస్సింగ్ మార్పించండి
  • ·డాక్టర్ చెప్పిన రోజు కుట్లు తీయించుకోండి – మర్చిపోవద్దు
  • ·షుగర్ ఉంటే అది అదుపులో ఉంచుకోవడమే గాయం మానడానికి ముఖ్యం

ఏం చేయకూడదు

  • ·కట్టు తడపడం
  • ·గీకడం, సొంతంగా పొడి ఒలిచేయడం
  • ·సొంత లేపనాలు, నాటు మందులు రాయడం

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·ఎరుపు చుట్టూ పాకడం
  • ·చీము, వాసన
  • ·జ్వరం
  • ·నొప్పి పెరగడం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Vamsi Krishnaడా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి