ఫిషర్
Anal fissure
మత్తు: స్పైనల్ లేదా లోకల్ సాధారణంగా 1–2 రోజులు
చాలామందికి మందులతోనే తగ్గుతుంది
ఎలా చేస్తారు
పగులు మానడానికి అడ్డుపడుతున్న కండరాన్ని కొంచెం సడలిస్తారు (sphincterotomy). చిన్న ఆపరేషన్, అరగంట లోపే.
దీన్నే ఇలా కూడా అంటారు: మలద్వారం చీలిక · మలవిసర్జన తర్వాత మంట · కత్తితో కోసినట్టు నొప్పి

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్
సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.
ఆపరేషన్ ముందు, తర్వాత
ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.
ముందు ఏం చేయాలి
- ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు – డాక్టర్ చెప్పినట్టు
- ·రక్తం పలచబడే మందులు (aspirin, clopidogrel) వాడుతుంటే ముందే చెప్పండి
- ·పాత రిపోర్టులు, మందుల చీటీ తీసుకురండి
తర్వాత ఏం చేయాలి
- ·రోజుకి రెండు మూడు సార్లు గోరువెచ్చని నీళ్లలో 10 నిమిషాలు కూర్చోవడం (sitz bath) – ఇదే నొప్పి తగ్గించే అసలు పని
- ·పీచు ఎక్కువ ఉన్న ఆహారం – ఆకుకూరలు, పండ్లు; రోజుకి 3 లీటర్ల నీళ్లు
- ·మలం మెత్తగా ఉండేలా డాక్టర్ ఇచ్చిన మందు తప్పకుండా వాడాలి
- ·నడవండి – మంచం మీదే ఉండిపోకండి
ఏం చేయకూడదు
- ·మలవిసర్జన సమయంలో ముక్కడం (బలవంతం) – కుట్లు విడిపోతాయి
- ·గట్టి కుర్చీ మీద, నేల మీద ఎక్కువసేపు కూర్చోవడం
- ·కారం, మసాలా – కొన్ని రోజులు తగ్గించండి
- ·బరువులు ఎత్తడం, బైక్ ఎక్కువ దూరం నడపడం (రెండు వారాలు)
ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి
- ·ఆగని రక్తస్రావం
- ·మూత్రం రాకపోవడం
- ·జ్వరం, చలి
- ·నొప్పి తగ్గకుండా పెరగడం
ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364
డా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్