🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

ఓవేరియన్ సిస్ట్ / ఫైబ్రాయిడ్స్

Ovarian cyst and fibroids

మత్తు: స్పైనల్ లేదా జనరల్ డాక్టర్ చెబుతారు

ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: ఒక్కసారిగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు – వెంటనే రండి

స్కాన్‌లో కనిపించిన సిస్ట్ లేదా ఫైబ్రాయిడ్ – పరిమాణం, ఇబ్బందిని బట్టి తొలగింపు

ఎలా చేస్తారు

సిస్ట్ లేదా ఫైబ్రాయిడ్‌ను మాత్రమే తీసి, గర్భసంచిని వీలైనంతవరకు కాపాడతారు. తీసినదాన్ని పరీక్షకు పంపుతారు.

దీన్నే ఇలా కూడా అంటారు: కడుపులో నీటి బుడగ · గడ్డ ఉంది అన్నారు · స్కాన్‌లో కనిపించింది

ఓవేరియన్ సిస్ట్ / ఫైబ్రాయిడ్స్
ఓవేరియన్ సిస్ట్ / ఫైబ్రాయిడ్స్ · చిత్రం

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్

సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·స్కాన్, రక్త పరీక్ష రిపోర్టులు తీసుకురండి
  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
  • ·నెలసరి మొదలైతే చెప్పండి; గర్భం ఉండే అవకాశం ఉంటే తప్పకుండా చెప్పండి
  • ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే ముందే చెప్పండి

తర్వాత ఏం చేయాలి

  • ·డాక్టర్ రాసిన ఐరన్, కాల్షియం మందులు పూర్తిగా వాడండి
  • ·ఇంట్లో మెల్లగా నడవండి – పూర్తి విశ్రాంతి కాదు, పూర్తి పని కాదు
  • ·శానిటరీ ప్యాడ్‌లే వాడండి
  • ·చెప్పిన రోజు చెక్‌అప్‌కి, రిపోర్ట్ కోసం తప్పకుండా రండి

ఏం చేయకూడదు

  • ·బరువులు ఎత్తడం, బిందెలు మోయడం – ఆరు వారాలు
  • ·డాక్టర్ సరే అనేవరకు శృంగారం
  • ·టాంపాన్లు వాడడం, లోపల కడగడం
  • ·పొలం పని, ఎక్కువ సేపు నిలబడి చేసే పని

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·గంటలో ఒక ప్యాడ్ తడిసేంత రక్తస్రావం
  • ·జ్వరం, చలి
  • ·వాసనతో కూడిన స్రావం
  • ·తీవ్రమైన కడుపు నొప్పి, స్పృహ తప్పినట్టు ఉండటం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

ఈ ఆపరేషన్ గైనకాలజిస్ట్ చేస్తారు. ఎవరు చేస్తారో, ఎప్పుడు అనేది కన్సల్టేషన్‌లో చెబుతారు – ముందు ఒకసారి చూపించుకోండి, పరీక్ష తర్వాత డాక్టర్ కచ్చితంగా చెబుతారు.

కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి