🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

D&C & ఇతర గైనిక్ ప్రొసీజర్లు

D and C

మత్తు: స్పైనల్ లేదా జనరల్ డాక్టర్ చెబుతారు

చిన్న ప్రొసీజర్ – చాలామంది అదే రోజు లేదా మరుసటి రోజు ఇంటికి

ఎలా చేస్తారు

గర్భసంచి లోపలి పొరను శుభ్రం చేసే చిన్న ప్రొసీజర్. మత్తులో, పావుగంట లోపే; చాలామంది అదే రోజు ఇంటికి వెళ్తారు.

దీన్నే ఇలా కూడా అంటారు: కడుపు శుభ్రం చేయాలి · గర్భస్రావం అయ్యింది

D&C & ఇతర గైనిక్ ప్రొసీజర్లు
D&C & ఇతర గైనిక్ ప్రొసీజర్లు · చిత్రం

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్

సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·స్కాన్, రక్త పరీక్ష రిపోర్టులు తీసుకురండి
  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
  • ·నెలసరి మొదలైతే చెప్పండి; గర్భం ఉండే అవకాశం ఉంటే తప్పకుండా చెప్పండి
  • ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే ముందే చెప్పండి

తర్వాత ఏం చేయాలి

  • ·డాక్టర్ రాసిన ఐరన్, కాల్షియం మందులు పూర్తిగా వాడండి
  • ·ఇంట్లో మెల్లగా నడవండి – పూర్తి విశ్రాంతి కాదు, పూర్తి పని కాదు
  • ·శానిటరీ ప్యాడ్‌లే వాడండి
  • ·చెప్పిన రోజు చెక్‌అప్‌కి, రిపోర్ట్ కోసం తప్పకుండా రండి

ఏం చేయకూడదు

  • ·బరువులు ఎత్తడం, బిందెలు మోయడం – ఆరు వారాలు
  • ·డాక్టర్ సరే అనేవరకు శృంగారం
  • ·టాంపాన్లు వాడడం, లోపల కడగడం
  • ·పొలం పని, ఎక్కువ సేపు నిలబడి చేసే పని

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·గంటలో ఒక ప్యాడ్ తడిసేంత రక్తస్రావం
  • ·జ్వరం, చలి
  • ·వాసనతో కూడిన స్రావం
  • ·తీవ్రమైన కడుపు నొప్పి, స్పృహ తప్పినట్టు ఉండటం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

ఈ ఆపరేషన్ గైనకాలజిస్ట్ చేస్తారు. ఎవరు చేస్తారో, ఎప్పుడు అనేది కన్సల్టేషన్‌లో చెబుతారు – ముందు ఒకసారి చూపించుకోండి, పరీక్ష తర్వాత డాక్టర్ కచ్చితంగా చెబుతారు.

కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి