24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

కీహోల్ అపెండిక్స్ ఆపరేషన్ (లాపరోస్కోపిక్) · AI చిత్రం

కీహోల్ అపెండిక్స్ ఆపరేషన్ (లాపరోస్కోపిక్)

Laparoscopic appendicectomy

మత్తు: జనరల్ సాధారణంగా 2–3 రోజులుడా. వంశీ కృష్ణ

ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: పెరుగుతున్న నొప్పి, జ్వరం, వాంతులు – ఇప్పుడే రండి

పొట్ట కుడివైపు కింద నొప్పికి – చిన్న కోతల ద్వారా అపెండిక్స్ తీసేయడం

ఎలా చేస్తారు

పొట్టకి మూడు చిన్న రంధ్రాలు పెట్టి, కెమెరాతో చూస్తూ వాచిన అపెండిక్స్‌ను తీసేస్తారు. పగిలి ఉంటే పొట్ట కడిగి, గొట్టం పెట్టాల్సి రావొచ్చు – అప్పుడు ఎక్కువ రోజులు ఉండాలి.

దీన్నే ఇలా కూడా అంటారు: కీహోల్ · దూరబిన్ · అపెండిక్స్ · చిన్న కోత

ఖర్చు

  • సర్జన్ ఫీజు – ప్రస్తుతం వసూలు చేయడం లేదు
  • జనరల్ రూమ్ ఛార్జ్ – ప్రస్తుతం వసూలు చేయడం లేదు
  • మీరు చెల్లించేవి – టెస్టులు, అనస్థీషియా (మత్తు), మందులు

మీకు ఆపరేషన్ అవసరమా, ఎంతవుతుందో డాక్టర్ పరీక్ష చేశాక, అడ్మిషన్ ముందే చెబుతారు.

హాస్పిటల్ ఛార్జీలు – పూర్తి వివరాలు →

ఇది ఆపరేషన్ – తెలిసి ఉండాల్సినవి

ఏ ఆపరేషన్‌కైనా మత్తు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్, గాయం ఆలస్యంగా మానడం వంటి సమస్యలు రావచ్చు; కొందరికి మళ్ళీ చేయాల్సి రావచ్చు. మీకు ఇది అవసరమా, మీ షుగర్, బి.పి., గుండె పరిస్థితితో సరిపోతుందా అన్నది పరీక్ష, టెస్టుల తర్వాతే డాక్టర్ నిర్ణయిస్తారు. సమ్మతి పత్రం తీసుకునే ముందు మీ ఆపరేషన్‌కి ఉన్న ప్రమాదాలను ఆయన విడిగా వివరిస్తారు – అడగడానికి సంకోచించకండి.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
  • ·షుగర్, బి.పి, గుండె మందులు ఏవి ఆ ఉదయం వేసుకోవాలో డాక్టర్‌ని అడిగి తెలుసుకోండి
  • ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే ముందే చెప్పండి

తర్వాత ఏం చేయాలి

  • ·మొదటి రోజే మెల్లగా నడవడం మొదలుపెట్టండి – ఊపిరితిత్తులకు, పేగులకు అదే మంచిది
  • ·గాలి పోయాక (అపానవాయువు) డాక్టర్ చెప్పినట్టు ముందు ద్రవాలు, తర్వాత మెత్తని ఆహారం
  • ·లోతైన శ్వాస వ్యాయామం రోజుకి కొన్నిసార్లు
  • ·కట్టు పొడిగా, శుభ్రంగా ఉంచండి

ఏం చేయకూడదు

  • ·బరువులు ఎత్తడం – ఆరు వారాల వరకు
  • ·కుట్లు మానకముందే స్నానంలో నానబెట్టడం
  • ·డాక్టర్ చెప్పకుండా సొంతంగా మందులు ఆపడం

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·పొట్ట ఉబ్బడం, ఆగని వాంతులు
  • ·జ్వరం
  • ·కుట్ల నుంచి చీము, రక్తం
  • ·నొప్పి తగ్గకుండా పెరగడం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Vamsi Krishnaడా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి