24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

K-వైర్ ఫిక్సేషన్ · చిత్రం

K-వైర్ ఫిక్సేషన్

K wire fixation

మత్తు: స్పైనల్ లేదా జనరల్ సాధారణంగా 1–2 రోజులుడా. గౌతమ్

సన్నని లోహపు తీగలతో విరిగిన చిన్న ఎముకను పట్టి ఉంచడం – పిల్లల ఎముకలకు, చేతి ఎముకలకు సాధారణం. తీగలు తర్వాత తీసేస్తారు

ఎలా చేస్తారు

విరిగిన చిన్న ఎముకను సరైన చోటుకు తెచ్చి, సన్నని తీగలతో పట్టి ఉంచి, పైన కట్టు వేస్తారు. ఎముక అతుక్కున్నాక తీగలు తీసేస్తారు.

దీన్నే ఇలా కూడా అంటారు: చిన్న ఎముక విరిగింది · వేలు విరిగింది · పిల్లాడికి చెయ్యి విరిగింది

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్

సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·X-ray, స్కాన్ రిపోర్టులు తీసుకురండి
  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
  • ·ఆ చేతికి/కాలికి ఉన్న ఉంగరాలు, గాజులు ముందే తీసేయండి – వాపు వస్తే తీయడం కష్టం

తర్వాత ఏం చేయాలి

  • ·ఆ భాగాన్ని గుండె కంటే ఎత్తుగా పెట్టుకోండి – వాపు తగ్గుతుంది
  • ·వేళ్లను కదిలిస్తూ ఉండండి – పట్టు పోకుండా ఉంటుంది
  • ·డాక్టర్ చెప్పిన ఫిజియోథెరపీ వ్యాయామాలు క్రమం తప్పకుండా – ఆపరేషన్ కంటే ఇవే ఫలితం ఇస్తాయి
  • ·చెప్పిన రోజు X-ray, చెక్‌అప్‌కి తప్పకుండా రండి

ఏం చేయకూడదు

  • ·డాక్టర్ సరే అనేవరకు ఆ కాలి మీద బరువు వేయడం
  • ·కట్టు/ప్లాస్టర్ తడపడం
  • ·సొంతంగా ప్లాస్టర్, స్లింగ్ తీసేయడం
  • ·పొగ తాగడం – ఎముక అతుక్కోవడం ఆలస్యం అవుతుంది

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·వేళ్లు తిమ్మిరెక్కడం, నీలంగా మారడం
  • ·ప్లాస్టర్ బిగుతుగా అనిపించడం
  • ·నొప్పి తగ్గకుండా పెరగడం
  • ·జ్వరం, కట్టు నుంచి వాసన

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Gడా. గౌతమ్MS (Ortho)సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి