
ఆర్థ్రోస్కోపీ (కీలు దూరబిన్) · చిత్రం
ఆర్థ్రోస్కోపీ (కీలు దూరబిన్)
Arthroscopy
మత్తు: స్పైనల్ లేదా జనరల్ సాధారణంగా 1–2 రోజులుడా. గౌతమ్
కీలు లోపల కెమెరా పంపి చూస్తూ సరిచేయడం – పెద్ద కోత ఉండదు, కోలుకోవడం వేగం
ఎలా చేస్తారు
కీలుకి రెండు చిన్న రంధ్రాలు పెట్టి కెమెరా పంపి, తెరపై చూస్తూ లోపల సరిచేస్తారు. పెద్ద కోత ఉండదు.
దీన్నే ఇలా కూడా అంటారు: మోకాలిలో ఏదో ఇరుక్కుంటోంది · మోకాలు లాక్ అవుతోంది · వాపు తగ్గట్లేదు
ఇప్పుడు నడుస్తున్న ఆఫర్
సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.
ఆపరేషన్ ముందు, తర్వాత
ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.
ముందు ఏం చేయాలి
- ·X-ray, స్కాన్ రిపోర్టులు తీసుకురండి
- ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
- ·ఆ చేతికి/కాలికి ఉన్న ఉంగరాలు, గాజులు ముందే తీసేయండి – వాపు వస్తే తీయడం కష్టం
తర్వాత ఏం చేయాలి
- ·ఆ భాగాన్ని గుండె కంటే ఎత్తుగా పెట్టుకోండి – వాపు తగ్గుతుంది
- ·వేళ్లను కదిలిస్తూ ఉండండి – పట్టు పోకుండా ఉంటుంది
- ·డాక్టర్ చెప్పిన ఫిజియోథెరపీ వ్యాయామాలు క్రమం తప్పకుండా – ఆపరేషన్ కంటే ఇవే ఫలితం ఇస్తాయి
- ·చెప్పిన రోజు X-ray, చెక్‌అప్‌కి తప్పకుండా రండి
ఏం చేయకూడదు
- ·డాక్టర్ సరే అనేవరకు ఆ కాలి మీద బరువు వేయడం
- ·కట్టు/ప్లాస్టర్ తడపడం
- ·సొంతంగా ప్లాస్టర్, స్లింగ్ తీసేయడం
- ·పొగ తాగడం – ఎముక అతుక్కోవడం ఆలస్యం అవుతుంది
ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి
- ·వేళ్లు తిమ్మిరెక్కడం, నీలంగా మారడం
- ·ప్లాస్టర్ బిగుతుగా అనిపించడం
- ·నొప్పి తగ్గకుండా పెరగడం
- ·జ్వరం, కట్టు నుంచి వాసన
ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364
