
ఇంప్లాంట్ తొలగింపు · చిత్రం
ఇంప్లాంట్ తొలగింపు
Implant removal
మత్తు: సెడేషన్ లేదా లోకల్ డే-కేర్ – అదే రోజు ఇంటికిడా. గౌతమ్
ఎముక అతుక్కున్నాక వేసిన ప్లేటు, స్క్రూలు, రాడ్ తీయడం – చాలామందికి ఏడాది తర్వాత. అదే రోజు ఇంటికి
ఎలా చేస్తారు
పాత కోత చోటే తెరిచి, ప్లేటు/స్క్రూలు/రాడ్ తీసి మళ్ళీ కుడతారు. చిన్న ఆపరేషన్, అదే రోజు ఇంటికి.
దీన్నే ఇలా కూడా అంటారు: ప్లేటు తీయాలి · స్క్రూలు గుచ్చుతున్నాయి · రాడ్ తీయించుకోవాలి
ఇప్పుడు నడుస్తున్న ఆఫర్
సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.
ఆపరేషన్ ముందు, తర్వాత
ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.
ముందు ఏం చేయాలి
- ·X-ray, స్కాన్ రిపోర్టులు తీసుకురండి
- ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
- ·ఆ చేతికి/కాలికి ఉన్న ఉంగరాలు, గాజులు ముందే తీసేయండి – వాపు వస్తే తీయడం కష్టం
తర్వాత ఏం చేయాలి
- ·ఆ భాగాన్ని గుండె కంటే ఎత్తుగా పెట్టుకోండి – వాపు తగ్గుతుంది
- ·వేళ్లను కదిలిస్తూ ఉండండి – పట్టు పోకుండా ఉంటుంది
- ·డాక్టర్ చెప్పిన ఫిజియోథెరపీ వ్యాయామాలు క్రమం తప్పకుండా – ఆపరేషన్ కంటే ఇవే ఫలితం ఇస్తాయి
- ·చెప్పిన రోజు X-ray, చెక్‌అప్‌కి తప్పకుండా రండి
ఏం చేయకూడదు
- ·డాక్టర్ సరే అనేవరకు ఆ కాలి మీద బరువు వేయడం
- ·కట్టు/ప్లాస్టర్ తడపడం
- ·సొంతంగా ప్లాస్టర్, స్లింగ్ తీసేయడం
- ·పొగ తాగడం – ఎముక అతుక్కోవడం ఆలస్యం అవుతుంది
ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి
- ·వేళ్లు తిమ్మిరెక్కడం, నీలంగా మారడం
- ·ప్లాస్టర్ బిగుతుగా అనిపించడం
- ·నొప్పి తగ్గకుండా పెరగడం
- ·జ్వరం, కట్టు నుంచి వాసన
ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364
