హెర్నియా (ఇంగ్వినల్/అంబిలికల్/ఇన్సిషనల్)
Hernia repair
ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: వాపు లోపలికి పోకపోవడం, వాంతులు, జ్వరం – ఎమర్జెన్సీ
మెష్ వేసి బాగుచేస్తారు; దానంతట తగ్గదు, పెద్దదవుతుంది
ఎలా చేస్తారు
బయటికి వచ్చిన పేగును లోపలికి పెట్టి, బలహీనమైన చోట మెష్ (వల) వేసి బలపరుస్తారు. మెష్ వల్లే మళ్ళీ రాకుండా ఉంటుంది.
దీన్నే ఇలా కూడా అంటారు: గజ్జల్లో వాపు · బొడ్డు దగ్గర వాపు · కుట్టు దగ్గర వాపు · పేగు దిగింది

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్
సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. దీనికి సాధారణంగా ₹8,000–12,000 అవుతుంది – మా సొంత బిల్లుల నుంచి కొలిచినది. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.
ఆపరేషన్ ముందు, తర్వాత
ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.
ముందు ఏం చేయాలి
- ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
- ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే ముందే చెప్పండి
- ·జలుబు, దగ్గు ఉంటే చెప్పండి – దగ్గు కుట్ల మీద ఒత్తిడి పెడుతుంది
తర్వాత ఏం చేయాలి
- ·కట్టు పొడిగా ఉంచండి; డాక్టర్ చెప్పిన రోజు డ్రెస్సింగ్ మార్పించండి
- ·మొదటి రోజు నుంచే మెల్లగా నడవండి
- ·దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు ఆ చోటుని చేత్తో నొక్కి పట్టుకోండి
- ·వదులైన లోదుస్తులు వాడండి
ఏం చేయకూడదు
- ·బరువులు ఎత్తడం – కనీసం నాలుగు వారాలు (10 కిలోల పైన అస్సలు వద్దు)
- ·పొలం పని, తోపుడు బండి, సైకిల్ – డాక్టర్ సరే అనేవరకు
- ·కుట్ల మీద నీళ్లు పడనివ్వడం, గీకడం
ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి
- ·ఆ చోట వాపు పెరగడం, ఎర్రబారడం
- ·కుట్ల నుంచి చీము లేదా వాసన
- ·జ్వరం
- ·మూత్రం రాకపోవడం
ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364
డా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్