పిత్తాశయ రాళ్లు (గాల్ బ్లాడర్)
Gall bladder stones
మత్తు: జనరల్ సాధారణంగా 2–3 రోజులు
ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: ఆగని నొప్పి, జ్వరం, కళ్ళు/చర్మం పసుపు
స్కాన్‌లో తేలుతుంది
ఎలా చేస్తారు
రాళ్లతో ఉన్న పిత్తాశయాన్నే తీసేస్తారు – రాళ్లు మాత్రమే తీస్తే మళ్ళీ తయారవుతాయి. పిత్తాశయం లేకుండా మనిషి మామూలుగానే ఉంటాడు.
దీన్నే ఇలా కూడా అంటారు: రాళ్లు · పొట్ట కుడివైపు పైన నొప్పి · తిన్నాక నొప్పి

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్
సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.
ఆపరేషన్ ముందు, తర్వాత
ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.
ముందు ఏం చేయాలి
- ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
- ·షుగర్, బి.పి, గుండె మందులు ఏవి ఆ ఉదయం వేసుకోవాలో డాక్టర్‌ని అడిగి తెలుసుకోండి
- ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే ముందే చెప్పండి
తర్వాత ఏం చేయాలి
- ·మొదటి రోజే మెల్లగా నడవడం మొదలుపెట్టండి – ఊపిరితిత్తులకు, పేగులకు అదే మంచిది
- ·గాలి పోయాక (అపానవాయువు) డాక్టర్ చెప్పినట్టు ముందు ద్రవాలు, తర్వాత మెత్తని ఆహారం
- ·లోతైన శ్వాస వ్యాయామం రోజుకి కొన్నిసార్లు
- ·కట్టు పొడిగా, శుభ్రంగా ఉంచండి
ఏం చేయకూడదు
- ·బరువులు ఎత్తడం – ఆరు వారాల వరకు
- ·కుట్లు మానకముందే స్నానంలో నానబెట్టడం
- ·డాక్టర్ చెప్పకుండా సొంతంగా మందులు ఆపడం
ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి
- ·పొట్ట ఉబ్బడం, ఆగని వాంతులు
- ·జ్వరం
- ·కుట్ల నుంచి చీము, రక్తం
- ·నొప్పి తగ్గకుండా పెరగడం
ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364
డా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్