ఫిస్టులా
Fistula
మత్తు: స్పైనల్ సాధారణంగా 1–2 రోజులు
మందులతో పూర్తిగా తగ్గదు
ఎలా చేస్తారు
చీము గొట్టం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో చూసి, దాన్ని తెరిచి లేదా దారం వేసి (seton) మాన్పిస్తారు. లోతును బట్టి ఒకటి కంటే ఎక్కువ సార్లు అవసరం కావొచ్చు.
దీన్నే ఇలా కూడా అంటారు: చీము కారుతోంది · మలద్వారం పక్కన రంధ్రం · మళ్ళీ మళ్ళీ చీము

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్
సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.
ఆపరేషన్ ముందు, తర్వాత
ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.
ముందు ఏం చేయాలి
- ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు – డాక్టర్ చెప్పినట్టు
- ·రక్తం పలచబడే మందులు (aspirin, clopidogrel) వాడుతుంటే ముందే చెప్పండి
- ·పాత రిపోర్టులు, మందుల చీటీ తీసుకురండి
తర్వాత ఏం చేయాలి
- ·రోజుకి రెండు మూడు సార్లు గోరువెచ్చని నీళ్లలో 10 నిమిషాలు కూర్చోవడం (sitz bath) – ఇదే నొప్పి తగ్గించే అసలు పని
- ·పీచు ఎక్కువ ఉన్న ఆహారం – ఆకుకూరలు, పండ్లు; రోజుకి 3 లీటర్ల నీళ్లు
- ·మలం మెత్తగా ఉండేలా డాక్టర్ ఇచ్చిన మందు తప్పకుండా వాడాలి
- ·నడవండి – మంచం మీదే ఉండిపోకండి
ఏం చేయకూడదు
- ·మలవిసర్జన సమయంలో ముక్కడం (బలవంతం) – కుట్లు విడిపోతాయి
- ·గట్టి కుర్చీ మీద, నేల మీద ఎక్కువసేపు కూర్చోవడం
- ·కారం, మసాలా – కొన్ని రోజులు తగ్గించండి
- ·బరువులు ఎత్తడం, బైక్ ఎక్కువ దూరం నడపడం (రెండు వారాలు)
ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి
- ·ఆగని రక్తస్రావం
- ·మూత్రం రాకపోవడం
- ·జ్వరం, చలి
- ·నొప్పి తగ్గకుండా పెరగడం
ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364
డా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్