
డెర్మాయిడ్ సిస్ట్ తొలగింపు · చిత్రం
డెర్మాయిడ్ సిస్ట్ తొలగింపు
Dermoid cyst
మత్తు: స్పైనల్ లేదా జనరల్ సాధారణంగా 1–2 రోజులుడా. వంశీ కృష్ణ
పుట్టుకతో వచ్చే సంచి – చాలావరకు కనుబొమ్మ, మెడ దగ్గర. మొత్తం తీస్తేనే మళ్ళీ రాదు
ఎలా చేస్తారు
సంచిని పొరతో సహా మొత్తం తీసేస్తారు – కోత వీలైనంత దాగే చోట పెడతారు. పొర మిగిలితే మళ్ళీ వస్తుంది.
దీన్నే ఇలా కూడా అంటారు: పుట్టుకతో ఉన్న గడ్డ · కనుబొమ్మ దగ్గర గడ్డ · మెల్లగా పెరుగుతోంది
ఇప్పుడు నడుస్తున్న ఆఫర్
సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.
ఆపరేషన్ ముందు, తర్వాత
ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.
ముందు ఏం చేయాలి
- ·ఆ చోట క్రీములు, నూనెలు రాయకండి
- ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే చెప్పండి
- ·షుగర్ ఉంటే చెప్పండి – మానడం నెమ్మదిగా ఉంటుంది
తర్వాత ఏం చేయాలి
- ·కట్టు పొడిగా ఉంచండి; డాక్టర్ చెప్పిన రోజు డ్రెస్సింగ్ మార్పించండి
- ·డాక్టర్ చెప్పిన రోజు కుట్లు తీయించుకోండి – మర్చిపోవద్దు
- ·షుగర్ ఉంటే అది అదుపులో ఉంచుకోవడమే గాయం మానడానికి ముఖ్యం
ఏం చేయకూడదు
- ·కట్టు తడపడం
- ·గీకడం, సొంతంగా పొడి ఒలిచేయడం
- ·సొంత లేపనాలు, నాటు మందులు రాయడం
ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి
- ·ఎరుపు చుట్టూ పాకడం
- ·చీము, వాసన
- ·జ్వరం
- ·నొప్పి పెరగడం
ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364
డా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్