🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

అపెండిక్స్

Appendicectomy

మత్తు: జనరల్ లేదా స్పైనల్ సాధారణంగా 2–3 రోజులు

ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: పెరుగుతున్న నొప్పి, జ్వరం, వాంతులు – ఇప్పుడే రండి

ఎలా చేస్తారు

వాచిన అపెండిక్స్‌ను తీసేస్తారు. పగిలి ఉంటే పొట్ట కడిగి, గొట్టం పెట్టాల్సి రావొచ్చు – అప్పుడు ఎక్కువ రోజులు ఉండాలి.

దీన్నే ఇలా కూడా అంటారు: పొట్ట కుడివైపు కింద నొప్పి · appendicitis

అపెండిక్స్
అపెండిక్స్ · చిత్రం

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్

సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
  • ·షుగర్, బి.పి, గుండె మందులు ఏవి ఆ ఉదయం వేసుకోవాలో డాక్టర్‌ని అడిగి తెలుసుకోండి
  • ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే ముందే చెప్పండి

తర్వాత ఏం చేయాలి

  • ·మొదటి రోజే మెల్లగా నడవడం మొదలుపెట్టండి – ఊపిరితిత్తులకు, పేగులకు అదే మంచిది
  • ·గాలి పోయాక (అపానవాయువు) డాక్టర్ చెప్పినట్టు ముందు ద్రవాలు, తర్వాత మెత్తని ఆహారం
  • ·లోతైన శ్వాస వ్యాయామం రోజుకి కొన్నిసార్లు
  • ·కట్టు పొడిగా, శుభ్రంగా ఉంచండి

ఏం చేయకూడదు

  • ·బరువులు ఎత్తడం – ఆరు వారాల వరకు
  • ·కుట్లు మానకముందే స్నానంలో నానబెట్టడం
  • ·డాక్టర్ చెప్పకుండా సొంతంగా మందులు ఆపడం

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·పొట్ట ఉబ్బడం, ఆగని వాంతులు
  • ·జ్వరం
  • ·కుట్ల నుంచి చీము, రక్తం
  • ·నొప్పి తగ్గకుండా పెరగడం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Vamsi Krishnaడా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి