🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

పులిపిర్లు & కొప్పు గడ్డల తొలగింపు

Warts and skin tag removal

మత్తు: లోకల్ (ఆ చోటుకి మాత్రమే మత్తు) డే-కేర్ – అదే రోజు ఇంటికి

ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: రంగు మారడం, రక్తం కారడం, వేగంగా పెరగడం – ఆలస్యం చేయకుండా చూపించండి

రేడియో ఫ్రీక్వెన్సీతో తీస్తారు – కుట్లు ఉండవు, అదే రోజు ఇంటికి

ఎలా చేస్తారు

ఆ చోటుకి మాత్రమే మత్తు ఇచ్చి, రేడియో ఫ్రీక్వెన్సీ పరికరంతో తీసేస్తారు. కుట్లు ఉండవు, పది నిమిషాల్లో అయిపోతుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: పులిపిర్లు · మెడ దగ్గర చిన్న గడ్డలు · పుట్టుమచ్చ లాంటిది · పెరుగుతోంది

పులిపిర్లు & కొప్పు గడ్డల తొలగింపు
పులిపిర్లు & కొప్పు గడ్డల తొలగింపు · చిత్రం

ఖర్చు

ఎన్ని సిట్టింగ్‌లు కావాలి, ఎంత చోటు ఉంది అనేదాన్ని బట్టి ఖర్చు మారుతుంది – డాక్టర్ ఒకసారి చూశాకే కచ్చితంగా చెప్పగలరు. సర్జరీ ఆఫర్ చర్మ చికిత్సలకు వర్తించదు. కన్సల్టేషన్ ఉచితం; ఖర్చు అడగడానికి 9346113364.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆ చోట క్రీములు, నూనెలు, మేకప్ ఏమీ రాయకుండా రండి
  • ·ఎండలో ఎక్కువ తిరగకండి – చర్మం కమిలి ఉంటే చికిత్స వాయిదా వేయాల్సి రావొచ్చు
  • ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే, లేదా షుగర్ ఉంటే చెప్పండి
  • ·ఇంతకు ముందు వాడిన క్రీములు, మందుల చీటీ తీసుకురండి

తర్వాత ఏం చేయాలి

  • ·ఆ చోటుని శుభ్రంగా, పొడిగా ఉంచండి
  • ·డాక్టర్ ఇచ్చిన లేపనం చెప్పినట్టే రాయండి
  • ·బయటికి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ / ముఖానికి గుడ్డ – ఎండ వల్లే మచ్చ ఎక్కువ నల్లబడుతుంది
  • ·ఒకటి కంటే ఎక్కువ సిట్టింగ్‌లు ఉంటే, చెప్పిన తేదీలకి క్రమం తప్పకుండా రండి – మధ్యలో ఆపితే ఫలితం రాదు

ఏం చేయకూడదు

  • ·పొక్కు లేదా పొరను గీకడం, ఒలవడం – మచ్చ అలాగే ఉండిపోతుంది
  • ·ఎండలో ఎక్కువసేపు ఉండటం
  • ·సొంత క్రీములు, నాటు మందులు, బ్లీచ్
  • ·ఆ చోట షేవింగ్, వాక్సింగ్ – డాక్టర్ సరే అనేవరకు

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·చీము, వాసన
  • ·ఎరుపు చుట్టూ పాకడం
  • ·జ్వరం
  • ·నొప్పి, వాపు పెరగడం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Meghana Valetiడా. మేఘన వలేటిMBBS., MD (DVL) – Gold Medalistసీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి